Asianet News TeluguAsianet News Telugu

‘ఖుషి’రీ రిలీజ్‌ సూపర్ హిట్..మధ్యలో ఈ రచ్చే అసలు బాగోలేదు

  పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తో థియేటర్లను దద్దరిల్లాయి. ఇదంతా ఒకెత్తు..సోషల్ మీడియాలో ఈ సినిమా గురించిన రచ్చ ఒక ఎత్తు. అంతదాకా అంతా బాగానే ఉంది కానీ...

pawan #Kushi re release comparison to Vijay Kushi movie
Author
First Published Jan 7, 2023, 6:51 AM IST


 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన “ఖుషి” సినిమాను కూడా 31 డిసెంబర్ శనివారం రోజున కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేలా రీ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా రీ రిలీజ్ సందర్భంగా అడ్వాన్స్ బుకింగ్స్ లో దుమ్ము లేపాయి. దాదాపు కోటి రూపాయలకుపైగా అడ్వాన్స్ బుకింగ్స్ అయ్యాయి. అలాగే ఈ సినిమా గత  వారం రిలీజైన చిన్న సినిమాల కంటే ఎక్కువ కలెక్షన్లను కొల్లగొట్టింది. ఇప్పటికే థియేటర్లలో సందడి చేస్తున్న ఈ మూవీ… ఫ్యాన్స్ హంగామాతో ఓ మానియాను క్రియేట్ చేస్తోంది. సుమారు 500 లకు పైగా థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమాని అభిమానులు ఫుల్ గా ఎంజాయ్ చేసారు.  పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తో థియేటర్లను దద్దరిల్లాయి. ఇదంతా ఒకెత్తు..సోషల్ మీడియాలో ఈ సినిమా గురించిన రచ్చ ఒక ఎత్తు. అంతదాకా అంతా బాగానే ఉంది కానీ... తమిళ ఖుషీ సినిమాని సీన్ లోకి తీసుకురావటం మాత్రం చాలా మందికి నచ్చటం లేదు.

పవన్ కళ్యాణ్ -ఎస్.జె.సూర్య కాంబినేషన్లో వచ్చిన ‘ఖుషి’ మూవీ.. తమిళ రీమేక్ అన్న సంగతి తెలిసిందే.మొదట ఎస్.జె.సూర్య అక్కడ విజయ్ తో చేసాక.. దాన్ని తెలుగులో రీమేక్ చేసాడు. తెలుగులో చాలా ఇంప్రవైజేషన్స్ చేసారు. పవన్ మార్క్ స్పష్టంగా కనపడేలా ఇంట్రడక్షన్ సీన్స్ నుంచి మార్పులు చేసుకుంటూ వచ్చారు. అందుకే తెలుగు వాళ్లకు తెగ నచ్చేసింది. అయితే కొందరు వీరాభిమానులు...ఈ టైమ్ లో పవన్ సీన్స్ ని, విజయ్ తమిళ సీన్స్ ని పోలుస్తూ పోస్ట్ లు పెడుతున్నారు. అది తమిళ విజయ్ ఫ్యాన్స్ కు కాలుతోంది.  వాళ్లంతా తిరిగి రివర్స్ లో మా విజయ్ చేసిన ఫలానా సినిమాని మీ పవన్ రీమేక్ లో ఇలా చేసాడంటూ రిప్లై లు ఇస్తున్నారు. అయితే ఇది కొందరికి సరదాగానే అనిపించినా ...పవన్ అభిమానులు చాలా మందికి నచ్చటం లేదు. ఇప్పుడు ఇదంతా అవసరమా...రీరిలీజ్ మూడ్ ని ఎంజాయ్ చేయకుండా అంటున్నారు. దానికి తోడు పవన్ యాంటి మీడియాలో ఈ రచ్చ విషయాన్ని హైలెట్ చేస్తూ కథనాలు వస్తున్నాయి.
 
ఇక ఈ సినిమా పవర్ స్టార్ కెరీర్‌‌లోనే బ్లాక్ బస్టర్‌ హిట్‌గా నిలిచి, ఎన్నో రికార్డులను నెలకొల్పింది. ఇప్పుడు కూడా ఈ సినిమా రికార్డ్ లు క్రియేట్ చేసింది. ఈ సినిమాకు బెనిఫిట్ షోలు ఉదయం 5 గంటలకు, ఆరు గంటలకు చాలా చోట్ల వేసారు. అవన్నీ దాదాపు హౌస్ ఫుల్ అయ్యాయి. ఇండియన్ సినీ చరిత్రలోనే ఇలా రీరిలీజ్ కు బెనిఫిట్ షోలు ప్లాన్ చేయటం తొలిసారి . ఏదైమైనా 21 ఏళ్ల తర్వాత ఈ సినిమా కొత్త రికార్డ్ లు క్రియేట్ చేయటం మామూలు విషయం కాదు. 

ఈ నేపధ్యంలో ఈ చిత్రం మరో రికార్డ్ ని క్రియేట్ చేసింది. అదేమిటంటే... రీరిలీజ్ లు అవుతున్న చిత్రాల్లో ఎక్కువ గ్రాస్ చేసిన చిత్రం ఇదే. ఈ చిత్రం  3.50 గ్రాస్ ప్రపంచ వ్యాప్తంగా వసూలు చేసింది.  

రొమాంటిక్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌గా 2001లో రిలీజ్ అయిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాని శ్రీసూర్య మూవీస్‌ బ్యానర్‌పై ఏఎమ్‌ రత్నం నిర్మించగా, ఎస్‌జే సూర్య దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో పవన్ కల్యాణ్ హీరోగా, భూమిక హీరోయిన్‌గా నటించారు.  ‘ఖుషి’ సినిమాను కూడా టెక్నాలజీ హంగులు చేర్చి, 4కే రిజల్యూషన్‌, 5.1 డాల్బీ ఆడియోతో రీరిలిజ్ చేసారు. దీంతో పవన్ అభిమానులు చాలా సంతోషంగా ఉన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios