పవన్‌ కళ్యాణ్ ప్రస్తుతం `వకీల్‌సాబ్‌` షూటింగ్‌ పూర్తి చేసుకుని విడుదలకు సిద్దమవుతుంది. మరోవైపు క్రిష్‌ దర్శకత్వంలో సినిమాని, `అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌` రీమేక్‌లో నటిస్తున్నారు. క్రిష్‌ చిత్రానికి సంబంధించి పలు ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ సినిమాకి `హరిహర వీరమల్లు` అనే టైటిల్‌ ప్రచారంలో ఉంది. దీన్ని మెగాసూర్య ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మాత ఏ.ఎంరత్నం నిర్మిస్తున్నారు. 

ఇదిలా ఉంటే ఈ సినిమా సరికొత్త రికార్డ్ క్రియేట్‌ చేయబోతుందట. ఏకంగా సినిమా కోసం 150 ఎకరాల్లో భారీ సెట్‌ని నిర్మించబోతున్నారట. చార్మినార్‌ సెట్‌ని, హర్బర్‌ సెట్‌ని నిర్మించబోతున్నారట. `ఒక్కడు` సినిమా తర్వాత ఛార్మినార్‌ సెట్‌ వేయడం విశేషం. అయితే ఇందులో పూర్తి ఛార్మినార్‌ని నిర్మిస్తున్నారు. యుద్ధ సైన్యాలు దాని నుంచి వెళ్లేలా, రియల్‌ ఛార్మినార్‌ తరహాలో సెట్‌ వేస్తున్నారని టాక్‌. సహజత్వానికి పెద్ద పీఠ వేస్తున్నారట.

మరోవైపు పీరియాడికల్‌ నేపథ్యంలో సినిమా సాగుతున్న నేపథ్యంలో ఔరంగజేబు కాలాన్ని రీక్రియేట్‌ చేయబోతున్నారట. అందుకు భారీగానే ఖర్చు చేస్తున్నట్టు తెలుస్తుంది. నగర శివారులో ఈ సెట్‌ నిర్మాణం జరుగుతుందని, ఇందులో టాకీ పార్ట్ తోపాటు భారీ యాక్షన్‌ ఎపిసోడ్స్ ని చిత్రీకరిస్తామని చెబుతున్నారు చిత్ర యూనిట్‌. ఇదిలా ఉంటే ఇందులోని యాక్షన్‌ సన్నివేశాల విషయంలోనూ పవన్‌ రికార్డ్ సృష్టించబోతున్నారు. గతంలో కనీవినీ ఎరుగని రీతిలో భారీ యాక్షన్‌ సన్నివేశాలుంటాయని టాక్‌. పవన్‌ కెరీర్‌లోనే ఇది బిగ్గెస్ట్ ఫైట్‌గా సీన్‌గా నిలుస్తుంది, టాలీవుడ్‌లోనే ఇది కొత్తగా ఉండబోతుందని టాక్‌. వీటిని రామ్‌లక్ష్మణ్‌ ఫైట్స్ మాస్టర్స్, పీటర్‌ హెయిన్స్ కంపోజ్‌ చేస్తున్నారట. వీరితోపాటు టాప్‌ ఫైట్‌ మాస్టర్లని రంగంలోకి దించుతున్నారని టాక్‌. 

పాన్‌ ఇండియా చిత్రంగా దీన్ని రూపొందిస్తున్నారు. పవన్‌ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌ చిత్రమిది. ఇందులో నిధి అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. బాలీవుడ్‌ నటి జాక్వెలిన్‌ మరో హీరోయిన్ నటిస్తుందని సమాచారం. తెలుగుతోపాటు ఇతర భాషలకు చెందిన కాస్టింగ్ కూడా ఉంటుందని టాక్‌. మొత్తానికి ఈ సినిమాతో పవన్‌ సరికొత్త రికార్డ్ క్రియేట్‌ చేయబోతున్నారని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.