పవన్ కళ్యాణ్ బ్యాక్ టు బ్యాక్  హిట్స్ తో ఫ్యాన్స్ కి మజా పంచుతున్నారు. ఆయన లేటెస్ట్ చిత్రాలు వకీల్ సాబ్, భీమ్లా నాయక్ హిట్  అందుకున్నాయి. ఈ రెండు చిత్రాలలో పవన్ లాయర్, పోలీస్ పాత్రల్లో కనిపించాడు. కాగా ఈసారి ఆయన ప్రొఫెసర్ అవతారం ఎత్తనున్నాడట. 


పవన్ కళ్యాణ్(Pawan Kalyan)ఫ్యాన్స్ ఎప్పటి నుండో కోరుకుంటున్న కాంబినేషన్ హరీష్ శంకర్- పవన్ కళ్యాణ్. దానికి ఓ బలమైన కారణం కూడా ఉంది. వరుస పరాజయాలతో కొట్టుమిట్టాడుతున్న పవన్ కి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చాడు దర్శకుడు హరీష్ శంకర్. అది కూడా ఓ రీమేక్ తో కావడం విశేషం. సల్మాన్ ఖాన్ హిట్ మూవీ దబాంగ్ రీమేక్ గా తెరకెక్కిన గబ్బర్ సింగ్ చిత్రానికి హరీష్ శంకర్ దర్శకుడు. అయితే ఒరిజినల్ కి అనేక మార్పులు చేసి పవన్ ఇమేజ్ కి తగ్గట్లుగా గబ్బర్ సింగ్ తెరకెక్కించి బ్లాక్ బస్టర్ విజయం అందుకున్నారు. 

హరీష్ శంకర్ రాసిన వన్ లైనర్స్, సన్నివేశాలు బాగా పేలాయి. గబ్బర్ సింగ్ విడుదలై పదేళ్లు కావస్తోంది. రాజకీయాల కోసం పవన్ గ్యాప్ తీసుకోవడంతో వీరి కాంబినేషన్ లో మరలా మూవీ రాలేదు. పవన్ మనసు మార్చుకొని కమ్ బ్యాక్ ప్రకటించారు. ఆయన వరుసగా ప్రకటించిన చిత్రాలలో హరీష్ శంకర్ మూవీ ఒకటి. ఇక ఈ చిత్రానికి భవదీయుడు భగత్ సింగ్ అనే టైటిల్ నిర్ణయించారు. మధ్యలో భీమ్లా నాయక్ చిత్రాన్ని పవన్ ఒప్పుకోవడంతో ఈ మూవీ ఆలస్యం అవుతుంది. 

అయితే త్వరలో ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. కాగా ఈ మూవీ గురించి ఓ క్రేజీ బజ్ సర్క్యూలేట్ అవుతుంది. భవదీయుడు భగత్ సింగ్ మూవీలో పవన్ కాలేజీ లెక్చరర్ రోల్ చేస్తున్నారట. ఆయన పవర్ ఫుల్ మాస్టర్ గా మెస్మరైజ్ చేయనున్నారనేది లేటెస్ట్ టాక్. ప్రచారం అవుతున్న పుకార్లలో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ, ప్రముఖంగా వైరల్ అవుతుంది. గతంలో పవన్ ఈ తరహా రోల్ చేయలేదు. నిజంగా పవన్ అలా కనిపిస్తే ఫ్యాన్స్ కి పండగే. 

గతంలో ఈ ప్రాజెక్ట్ పై మరొక రూమర్ వినిపించింది. గబ్బర్ సింగ్ మాదిరి ఇది కూడా ఓ రీమేక్ అంటూ కథనాలు వెలువడ్డాయి. అయితే వీటిని దర్శకుడు హరీష్ శంకర్ ఖండించారు. భవదీయుడు భగత్ సింగ్ స్ట్రైట్ మూవీ అని ఆయన చెబుతున్నారు. మరోవైపు పవన్ తమిళ హిట్ మూవీ వినోదయ చిత్తం రిమేక్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ మూవీ రీమేక్ కోసం భవదీయుడు భగత్ సింగ్ ప్రాజెక్ట్ సైతం వెనక్కినెట్టాడనేది సమాచారం. వినోదయ చిత్తం రీమేక్ ప్రకటన జరిగితే పవన్ హరీష్ మూవీ వెనక్కి నెత్తినట్లే అనుకోవాలి. అలాగే దర్శకుడు సురేందర్ రెడ్డితో ప్రకటించిన మూవీ ఆగిపోయినట్లు కూడా వార్తలు వస్తున్నాయి.