పవన్ కళ్యాణ్ నటిస్తున్న `వకీల్‌సాబ్` సినిమా ఈ నెల 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. సినిమాకి రెండు తెలుగు రాష్టాల్లో భారీగా బెనిఫిట్ షోస్ వేయబోతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఇది సెన్సార్ పూర్తి చేసుకుంది.
పవన్ కళ్యాణ్ నటించిన `వకీల్‌సాబ్` సినిమా విడుదలకు అన్ని రకాలుగా గ్రీన్ సిగ్నల్ లభించింది. తాజాగా ఈ సినిమా సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది. సినిమాని వీక్షించిన సెన్సార్ సభ్యులు సర్టిఫై చేశారు. ఈ చిత్రానికి `యు / ఏ` సర్టిఫికేట్ ని ఇచ్చారు. సినిమా నిడివి 154 నిమిషాలని స్పష్టమైంది. ఈ విషయాన్ని చిత్ర బృందం వెల్లడించింది. సెన్సార్ వర్గాల నుంచి పాజిటివ్ రియాక్షన్ వచ్చిందని టాక్. దీంతో సినిమా రిలీజ్‌కి అన్ని రకాల క్లియరెన్స్ లు వచ్చినట్టయ్యింది. ఇక హిందీ సినిమా `పింక్`కి రీమేక్‌గా రూపొందిన ఈ సినిమాకి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించారు. అంజలి, నివేదా థామస్, అనన్య నాగళ్ల హీరోయిన్లుగా నటించారు. దిల్‌రాజు నిర్మించారు.
ఈ సినిమా ఈ నెల 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. సినిమాకి రెండు తెలుగు రాష్టాల్లో భారీగా బెనిఫిట్ షోస్ వేయబోతున్నారు. దీనికి సంబంధించిన అధికారిక పర్మిషన్ కూడా లభించిందని టాక్. దీంతో ఇప్పటికే ఒక్కో టికెట్ వేలల్లో పలుకుతుందని సమాచారం. పవన్ కళ్యాణ్ మూడేళ్ల గ్యాప్‌తో చేసిన సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఆ అంచనాలకు తగ్గట్టుగా సినిమా ఉంటుందా? అనేది చూడాలి. ఇందులో పవన్‌కి జోడిగా శృతి హాసన్ కనిపించనున్నారు.
