రాజకీయ నాయకుడిగా మారి మూడేళ్లు గ్యాప్ తీసుకున్నా పవన్ కళ్యాణ్ ఫాలోయింగ్ ఇంచు కూడా తగ్గలేదని వకీల్ సాబ్ మూవీ నిరూపించింది. వకీల్ సాబ్ మూవీ బాక్సాఫీస్ దుమ్ము దులిపింది. మొదటి వారానికే వంద కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టి, సత్తా చాటింది. మొదటి షో నుండే పాజిటివ్ టాక్ సొంతం చేస్తున్న వకీల్ సాబ్ భారీ ఓపెనింగ్స్ దక్కించుకుంది. 


ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వకీల్ సాబ్ చిత్రం కోసం ఎగబడ్డారు. వకీల్ సాబ్ ప్రదర్శిస్తున్న థియేటర్స్ ఫ్యాన్స్ తో నిండిపోయాయి. వకీల్ సాబ్ విడుదల రోజు ఫ్యాన్స్ చేసిన హంగామా మరచిపోలేము. కెరీర్ లో మొదటిసారి లాయర్ రోల్ చేసిన పవన్ అదరగొట్టాడు. వన్ మాన్ షోగా వకీల్ సాబ్ లో పవన్ రెచ్చిపోయి నటించారు. 


సోషల్ సబ్జెక్టుకి పవన్ కళ్యాణ్ ఇమేజ్ కి తగ్గట్టుగా కమర్షియల్ అంశాలు జోడించి, శ్రీరామ్ వేణు చక్కగా తెరకెక్కించారు. ప్రధాన పాత్రలు చేసిన అంజలి, నివేదా థామస్, అనన్యలతో పాటు ప్రకాష్ రాజ్ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా థమన్ బీజీఎమ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 
ఇక వకీల్ సాబ్ వసూళ్ల విషయానికి వస్తే భారీ కలెక్షన్స్ రాబట్టినప్పటికీ ఈ మూవీ ఇంకా బ్రేక్ ఈవెన్ కి చేరుకోలేదు. పవన్ కి ఉన్న క్రేజ్ రీత్యా అత్యధిక ధరకు వకీల్ సాబ్ హక్కులు దక్కించుకున్న డిస్ట్రిబ్యూటర్స్, ఇంకా గట్టెక్కలేదు. ఉగాది పండగ వరకు జోరు చూపించిన వకీల్ సాబ్ తరువాత బాక్సాఫీస్ వద్ద నెమ్మదించింది. బ్రేక్ ఈవెన్ కి రావాలంటే ఇంకా మెరుగైన వసూళ్లు రాబట్టాల్సి ఉంది. ఏరియాల వారీగా వకీల్ సాబ్ 9 డేస్ కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి. 

నైజాం రూ. 23.15 కోట్లు
సీడెడ్ రూ.12.15కోట్లు

వైజాగ్ రూ.11.00 కోట్లు

తూర్పు రూ.5.85కోట్లు

వెస్ట్ రూ.6.83కోట్లు

కృష్ణ రూ.4.68కోట్లు

గుంటూరు రూ.6.78కోట్లు

నెల్లూరు రూ.3.16కోట్లు

ఏపీ & తెలంగాణా   షేర్: రూ.73.60కోట్లు

కర్ణాటక & రెస్ట్ ఆఫ్ ఇండియా రూ.3.54కోట్లు

యూఎస్ఏ & రెస్ట్ ఆఫ్ వరల్డ్ రూ.3.78కోట్లు

మొత్తం వరల్డ్ వైడ్ షేర్: రూ.80.92కోట్లు

మొత్తం వరల్డ్ వైడ్ గ్రాస్ : రూ.129.6కోట్లు