అలు సినిమాలు.. ఇటు పాలిటిక్స్ తో బిజీ బిజీగా ఉన్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. పెండింగ్ షూటింగ్స్ విషయంలో రకరకాల వాదనలు వినిపిస్తుండగా.. తాజాగా ఆయన ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.
ఫ్యాన్స్ కు వరుసగా భారీ ట్రీట్లు రెడీ చేస్తున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ . ఆయన పాలిటిక్స్ లో తీరికలేకుండా ఉన్నా.. ఇటు అభిమానులకు కావాల్సిన వినోదాన్ని అందించే పని మాత్రం నిర్లక్య్యం చేయడం లేదు. రీసెంట్ గా బ్రో సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు పవర్ స్టార్. సముద్రఖని డైరెక్షన్ లో తెరకెక్కిన ఈసినిమా.. బాక్సాఫీస్ దగ్గర రికార్డులు క్రియేట్ చేస్తుంది. నిర్మాతకు కాసుల పండ పండిస్తుంది. అంతే వివాదంగా కూడా మారందీ మూవీ.
ఇక పవర్ స్టార్ సినిమాల కోసం ఎదురు చూసే ఫ్యాన్స్ కు సెట్స్ మీద మరో రెండు సినిమాలు కనిపిస్తున్నాయి. హిస్టారికల్ మూవీ హరి హర వీరమల్లుతో పాటు..చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న ఉస్తాద్ భగత్ సింగ్ వైపు చూస్తున్నారు ఫ్యాన్స్. కాని పవర్ స్టార్ చాలా టైట్ షెడ్యూల్స్ లో ఉంటున్నాడు. ఎలక్షన్స్ కు ఎక్కువగా టైమ్ లేకపోవడంతో.. జనసేనను ఇంకా బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే ఎలాగోలా.. బ్రో మూవీ కంప్లీట్ చేసి రిలీజ్ చేశారు. అంతకు ముందుసినిమాలు కూడా అలానే కంప్లీట్ చేసిన పవర్ స్టార్..నెక్ట్స్ సినిమాలకు మాత్రం చేసే అవకాశం లేదన్నవాదన వినిపిస్తుంది.
హరిహరవీరమల్లుతోపాటు.. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాల షూటింగ్స్ ఎలక్షన్స్ తరువాతే అన్న మాటలు వినిపిస్తున్నక్రమంలో.. పవర్ స్టార్ నుంచి అభిమానులకు గుడ్ న్యూస్ వినిపిస్తోంది. ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ కు పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ఎలక్షన్స్ లోపు ఉస్తాద్ భగత్ సింగ్ ను కంప్లీట్ చేసే ఆలోచనలో ఉన్నాడట పవర్ స్టార్. ఇది మాస్ మూవీ కావడంతో.తనకు కూడా ఎలక్షన్స్ టైమ్ లో ఉపయోగపడుతుందన్న ఆలోచనలో ఉన్నాడట పవన్. అయితే ఈసినిమా కంప్లీట్ చేయడం కోసం హరీష్ శంకర్ కు కండీషన్ పెట్టాడట పవర్ స్టార్.
30 రోజుల్లో ఈసినిమా షూటింగ్ కంప్లీట్ చేసేలా ప్లాన్ చేసుకోవాలని. అలా అయితే ఈ 30 రోజులు కాల్షీట్ ఇవ్వడానికి తాను రెడీగా ఉన్నట్టు పవర్ స్టార్ అన్నట్టు సమాచారం. దీంతో త్వరలోనే పక్కా ప్రణాళికతో స్క్రిప్ట్ రెడీ చేసి తీసుకొస్తానని అన్నారట హరీష్. పవన్ పూర్తిగా ఎన్నికల ప్రచారానికి వెళ్లకమునుపే ఈ సినిమాను కంప్లీట్ చేద్దామని హరీష్ కు హామీ ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి.ఇప్పటికే హరీష్ శంకర్ ఫుల్ ప్రిపేర్డ్ గా ఉన్నాడు. ఎప్పుడెప్పుడు పవర్ స్టార్ దొరుకుతాడా అని చూస్తున్నాడు. బాగా ఆకలి మీద ఉన్న హీరీష్ కు 30 రోజుల్లో షూటింగ్ కంప్లీట్ చేయడం ఓ లెక్కేం కాదు అంటున్నారు సినీ జనాలు. లేటెస్ట్ సమాచారం ప్రకారం మిడ్ ఆగస్టులో ఉస్తాద్ మూవీ నెక్ట్స్ షెడ్యూల్ షురూ కానున్నట్ట సమాచారం.
పవన్ కల్యాణ్ నుంచి రాబోతున్న పర్‌ఫెక్ట్ కమర్షియల్ సినిమా లోడింగ్.. అంటూ తాజా అప్‌డేట్ ఇప్పుడు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది. ఉస్తాద్ భగత్ సింగ్ గ్లింప్స్ నెట్టింట ట్రెండింగ్ అవుతూ మిలియన్ల సంఖ్యలో వ్యూస్ రాబడుతోంది. భగత్ సింగ్ మహంకాళి పోలీస్‌స్టేషన్, పత్తర్ గంజ్, ఓల్డ్ సిటీ. ఈ సారి పర్ ఫార్మన్స్ బద్దలైపోద్ది.. అంటూ తనదైన మ్యానరిజంతో సాగుతున్న పవన్ కల్యాణ్ డైలాగ్స్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతూ.. సూపర్ బజ్ క్రియేట్ చేస్తున్నాయి. గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ కాంబినేషన్‌లో రాబోతున్న సినిమా కావడంతో.. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
