ఎవ్వరూ ఊహించని విధంగా తాజాగా ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం నుంచి అప్డేట్ వచ్చింది.  ఎవ్వరూ ఊహించనిది మీ ముందుకు వస్తోంది అంటూ చిత్ర యూనిట్ అప్డేట్ ఇచ్చింది.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ తో బిజీగా ఉన్నారు. ఏపీలో ఎన్నికల వేడి మొదలైపోయింది. ఎలక్షన్ కమిషన్ నుంచి కూడా ఎన్నికల తేదీ వెలువడంతో అన్ని పార్టీలు విజయం కోసం యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నాయి. జనసేనాని కూడా జనసేన పార్టీ విజయం కోసం వ్యూహరచనలో బిజీగా ఉన్నారు. 

ఎన్నికల సమయం కావడంతో పవన్ తాను నటిస్తున్న అన్ని చిత్రాల షూటింగ్స్ పక్కన పెట్టేశారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజి చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాల షూటింగ్స్ తాత్కాలికంగా నిలిచిపోయాయి. ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ ఈ చిత్రాలని పూర్తి చేయనున్నారు. 

Scroll to load tweet…

అయితే ఎవ్వరూ ఊహించని విధంగా తాజాగా ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం నుంచి అప్డేట్ వచ్చింది. ఎవ్వరూ ఊహించనిది మీ ముందుకు వస్తోంది అంటూ చిత్ర యూనిట్ అప్డేట్ ఇచ్చింది. మైత్రి మూవీస్ సంస్థ అధికారికంగా ఈ పడేట్టు ఇచ్చింది. పవన్ కళ్యాణ్ ఏకంగా పొలిటికల్ డ్రెస్ లోనే డబ్బింగ్ చెప్పడానికి వెళ్లారు. 

హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ ఉన్న దృశ్యాల్ని పోస్ట్ చేశారు. ఒక డైలాగ్ టీజర్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ అప్డేట్ తో ఫ్యాన్స్ కూడా ఆశ్చర్యపోతున్నారు. ఇలాంటి టైంలో టీజర్ ఏంటి అని చర్చించుకుంటున్నారు. అయితే దీనికి ఓ కారణం ఉంది. ఈ నెల 19న ముంబైలో అమెజాన్ ప్రైమ్ ఆధ్వర్యంలో ఒక ఈవెంట్ జరగబోతోంది. ఈ ఈవెంట్ కోసం టీజర్ రెడీ చేస్తున్నారు. ముందుగా ఫ్యాన్స్ కోసం ఈ టీజర్ ని రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది.