ఇప్పుడు సంక్రాంతి కానుకగా అదిరిపోయే అప్‌డేట్‌ ఇచ్చింది యూనిట్‌. పండుగని పురస్కరించుకుని Unstoppablewithnbk2 పవన్‌ ఎపిసోడ్‌ గ్లింప్స్ విడుదల చేయబోతున్నారు. 

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ ఫస్ట్ టైమ్‌ ఓ ఓటీటీ షోలో పాల్గొన్నారు. బాలకృష్ణ హోస్ట్ గా రన్‌ అవుతున్న `అన్‌స్టాపబుల్‌విత్‌ ఎన్బీకే2` షోలో ఆయన పాల్గొన్నారు. గత నెలలోనే పవన్‌ ఎపిసోడ్‌ని చిత్రీకరించారు. గాడ్‌ ఆఫ్‌ మాసెస్‌ బాలయ్య, పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ మధ్య జరిగిన ఈ అరుదైన కన్వర్జేషన్‌ ఇప్పుడు సంచలనంగా మారుతుంది. వీరిద్దరి మధ్య ఎలాంటి చర్చ జరిగిందనేది హాట్‌ టాపిక్‌ అవుతుంది. ఇప్పటికే ఒకటి రెండు ప్రశ్నలు లీక్‌ అయి వైరల్‌ అయ్యాయి. 

ఇప్పుడు సంక్రాంతి కానుకగా అదిరిపోయే అప్‌డేట్‌ ఇచ్చింది యూనిట్‌. పండుగని పురస్కరించుకుని పవన్‌ ఎపిసోడ్‌ గ్లింప్స్ విడుదల చేయబోతున్నారు. ఈ విషయాన్ని `ఆహా` తాజాగా ప్రకటించింది. రేపు(ఆదివారం) ఉదయం 11 గంటలకు పవన్‌ కళ్యాణ్‌ `అన్‌స్టాపబుల్‌విత్‌ ఎన్బీకే 2` ఎపిసోడ్‌ గ్లింప్స్ ని విడుదల చేయబోతున్నట్టు వెల్లడించింది. ఎన్బీకే వర్సెస్‌ పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ మధ్య సాగేఈ ఎపిసోడ్‌ ఎలా ఉంటుందో మీ ఇమాజినేషన్‌కే వదిలేస్తున్నామని తెలిపింది `ఆహా`. 

రేపు పండగ పూట పవర్‌ స్టార్‌ ఫ్యాన్స్ కి అదిరిపోయే సర్‌ప్రైజ్‌ ఇవ్వబోతున్నారట. అయితే ఇందులో ఏం రివీల్‌ చేయబోతున్నారు. గ్లింప్స్ ని ఎంత క్రేజీగా కట్ చేశారనేది ఆసక్తిని క్రియేట్‌ చేస్తుంది. అయితే మొత్తానికి సంక్రాంతి సెలబ్రేషన్‌ పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్స్ దే అనేట్టుగా ఈ అప్‌డేట్‌ ఉండబోతుందని చెబుతుంది `ఆహా` టీమ్‌. దీంతో ప్రస్తుతం ఈ అప్‌డేట్‌ సోషల్‌ మీడియాలో ట్రెండ్ అవుతుంది. 

Scroll to load tweet…

బాలకృష్ణ హోస్ట్ గా రన్‌ అవుతున్న ఈ టాక్‌ షో ఇప్పటికే మొదటి సీజన్‌ పెద్ద సక్సెస్‌ అయ్యింది. టాక్‌ షోలకు అమ్మ మొగుడైందని బాలయ్య చెబుతున్నారు. ఇక రెండవ సీజన్‌ అంతకు మించి ఉంది అనేలా డిజైన్‌ చేశారు. మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, లోకేష్‌, అలాగే మరో మాజీ సీఎం కిరణ్‌ కుమార్‌ రెడ్డిలు, ప్రభాస్‌,గోపీచంద్‌, జయసుధ, జయప్రద వంటి వారు ఈ సీజన్‌లో సందడి చేసిన విషయం తెలిసిందే. నెక్ట్స్ ఎపిసోడ్‌ పవన్‌ కళ్యాణ్‌ ది స్ట్రీమింగ్‌ కానుంది.