20లక్షలకు చేరిన పవన్ ట్విట్టర్ ఫాలోవర్లు కృతజ్ఞతలతో ట్వీట్ చేసిన పవన్ వైరల్ అయిన పవన్ ట్వీట్

సినీ నటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్.. సోషల్ మీడియాతో తరచూ టచ్ లో ఉంటారు. తన సినిమాల గురించి ఎప్పుడూ ప్రస్తావించడు కానీ.. సమాజంలో జరిగే పలు అంశాలపై మాత్రం తప్పకుండా స్పందిస్తూ ఉంటారు. ట్విట్టర్ వేదికగా ఆయన చేసిన ప్రతి ట్వీట్ మీడియాలో ఎప్పుడూ సంచనంగా మారుతూనే ఉంటుంది. ప్రస్తుతం ఆయన చేసిన ట్వీట్ ఒకటి కూడా వైరల్ గా మారింది.

పవన్ ట్విట్టర్ ఖాతా ఫాలోవర్ల సంఖ్య 20లక్షలకు చేరింది. ఈ సందర్భంగా ఆయన తన అభిమానులందరినీ ఉద్దేశించి ఓ కవిత రాశారు. ప్రస్తుతం ఆ కవితే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ‘ మూడేళ్ల క్రితం జనసేన పార్టీ పెట్టినప్పుడు.. దారంతా గోతులు.. చేతిలో దీపం లేదు. ధైర్యమే కవచంగా ఒకే గొంతుకతో మొదలు పెట్టాను, నేను స్పందించిన ప్రతి సమస్యకి మేమున్నామంటూ ప్రతి స్పందించి, ఈ రోజు ఇరవై లక్షల దీపాలతో దారంతా వెలిగించిన మీ అభిమానానికి శిరస్సు వంచి కృతజ్ఞతలతో- మీ పవన్ కళ్యాణ్’ అంటూ ఓ కవిత ట్వీట్ చేశారు.

ఆయన ట్వీట్ చేసిన కొద్ది సేపటికే దానిని కొన్ని వేల మంది రీట్వీట్ చేశారు. వేలల్లో రిప్లేలు కూడా వచ్చాయి.