కాశీలో ఫైనల్ రౌండ్, ఖరారైన పి.ఎస్.పి.కె25 డేట్స్

కాశీలో ఫైనల్ రౌండ్, ఖరారైన పి.ఎస్.పి.కె25 డేట్స్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్,, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ల క్రేజీ కాంబినేషన్ లో వస్తోన్న అజ్ఞాత వాసి చిత్రం  ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పవన్ కల్యాణ్ 25 వ చిత్రంతో ఈ కాంబినేషన్ లో హ్యాట్రిక్ హిట్ కొట్టాలని దర్శకుడు త్రివిక్రమ్ ఈ సినిమాపై స్పెషల్ ఫోకస్ పెట్టాడు. జల్సా,అత్తారింటికి దారేది చిత్రాల తర్వాత ఈ క్రేజీ కాంబోలో రాబోతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

 

ఈ సినిమా చివరి షెడ్యూల్ కోసం త్వరలో వారణాసి వెళ్లనుంది చిత్ర యూనిట్. అక్కడే చివరి షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకోనున్నారు. ఇక ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ - అనిరుధ్ కంపోజ్ చేసిన `బయటికొచ్చి` చూస్తే లిరికల్ సాంగ్ - హీరోయిన్ కీర్తి సురేశ్ -పవన్ ల లుక్స్.. ఈ సినిమా పై అంచనాలు మరింత పెంచాయి. అయితే పవన్ కళ్యాణ్ అభిమానులేకాక.. ప్రేక్షకులంతా ఇప్పటివరకు ఈ చిత్ర ఫస్ట్ లుక్ బయటికి రాకుండా.. పలుమార్లు వాయిదా పడడంపై నిరుత్సాహపడుతున్నారు.

 

ఇన్నాళ్లుగా వెయిట్ చేస్తున్న అభిమానులకు, ప్రేక్షకులకు డబుల్ ధమాకా ఇచ్చేందుకు 'అజ్ఞాతవాసి` చిత్ర యూనిట్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. 20 రోజుల వ్యవధిలో ఆ చిత్ర ఫస్ట్ లుక్, ఆడియో రిలీజ్ చేసేసి పవన్ అభిమానులకు కానుకగా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

 

ఈ నెల 25వ తేదీన సాయంత్రం 6 గంటలకు ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఫస్టులుక్, ఆడియోను వచ్చేనెల 15వ తేదీన విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. అయితే ఈ సినిమాను జనవరి 10వ తేదీన విడుదల చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. అయితే బెనిఫిట్ షోలకు  హైదరాబాద్ లో కష్టమవుతుండటంతో జనవరి 9 సెకండ్ షో తోనే ఈ సినిమాను విడుదల చేయబోతున్నారని తెలుస్తోంది.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos