`ఖుషి` చిత్రం పవన్ కళ్యాణ్ స్టయిల్‌కి, తన మ్యానరిజాన్ని యూత్‌లో బలమైన ముద్ర వేసిన చిత్రం. డ్రెస్సింగ్ స్టయిల్‌కి కూడా ఇదొక కేరాఫ్‌గా నిలిచింది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సంచలనం `ఖుషి`. రొమాంటిక్ కామెడీగా రూపొందిన ఈ సినిమా 2001లో విడుదలై ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. పవన్ కళ్యాణ్ స్టయిల్‌కి, తన మ్యానరిజాన్ని యూత్‌లో బలమైన ముద్ర వేసిన చిత్రం. డ్రెస్సింగ్ స్టయిల్‌కి కూడా ఇదొక కేరాఫ్‌గా నిలిచింది. ఎంతో మంది అభిమానులు ఈ సినిమాని చూసి పవన్ మ్యానరిజాన్ని ఫాలో అయ్యేవారు. ఆయనకి ఫ్యాన్స్ అయ్యారు. `తొలి ప్రేమ` తర్వాత ఆ రేంజ్‌లో పవన్‌కి విజయాన్ని అందించిన చిత్రమిది. ఓ రకంగా ఇది ట్రెండ్ సెట్టర్ చిత్రమని చెప్పొచ్చు. దీనికి తమిళ దర్శకుడు, నటుడు ఎస్.జె సూర్య ఈ సినిమాకి దర్శకత్వం వహించారు.
తమిళంలో ఎస్.జె. సూర్య రూపొందించిన `ఖుషి`కిది రీమేక్. అందులో విజయ్, జ్యోతిక నటించారు. అక్కడ సూపర్ హిట్ కావడంతో, దీన్ని వెంటనే పవన్ హీరోగా, భూమిక కథానాయికగా తెలుగులో రీమేక్ చేశారు. ఏ.ఎం. రత్నం నిర్మించారు.2001 ఏప్రిల్ 27న సినిమా విడుదలై బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. సరిగ్గా ఇప్పుడీ సినిమా 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. పవన్ కెరీర్‌లో ఓ మైలురాయిలాంటి సినిమా 20ఏళ్లు కంప్లీట్ చేసుకోవడంతో చిత్ర బృందంతోపాటు, అభిమానులు పండగ చేసుకుంటున్నారు.
నిర్మాత ఏఎం రత్నం స్పందిస్తూ, `కొన్ని సినిమాలు ఎవర్‌గ్రీన్, కొన్ని సినిమాలు ట్రెండ్ సెట్టర్, మరికొన్ని సినిమాల కల్ట్ క్లాసిక్. ఈ అన్ని కలిపితే `ఖుషి`. ఈ సినిమాని నిర్మించినందుకు గర్వపడుతున్నా. పవన్ కళ్యాణ్, ఎస్.జె సూర్యలకు ధన్యవాదాలు` అని తెలిపారు. ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందించారు. ఇందులోని పాటలన్నీ సూపర్ హిట్. ఇప్పటికీ ఆ పాటలు శ్రోతలను అలరిస్తాయి. ఇక ఇందులో భూమిక నడుముని పవన్ చూసిన సీన్ హైలైట్ అని చెప్పొచ్చు. `మీరు గుడుంబ సత్తి కావచ్చు.. తొక్కల సత్తి కావచ్చు.. బట్ ఆ డోంట్ కేర్, బికాస్ ఐ యామ్ సిద్దు సిద్ధార్థ రాయ్`, `బెంగాల్ టైగర్ సిద్దు సిద్ధార్థ రాయ్` అని చెప్పే డైలాగ్‌లు ఫ్యాన్స్ ని ఊపేశాయి.
పవన్‌కి `ఖుషి` ఏడో సినిమా. ఇటీవల ఆయన `వకీల్‌సాబ్`తో 26వ చిత్రాన్ని పూర్తి చేసుకున్నారు. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో `హరిహర వీరమల్లు`లో నటిస్తున్నారు. దీంతోపాటు సాగర్ కె చంద్ర దర్శకత్వంలో మలయాళ హిట్ చిత్రం `అయ్యప్పనుమ్ కోషియుమ్`లో నటిస్తున్నారు. వీటితోపాటు హరీష్ శంకర్‌తో ఓ సినిమా, సురేందర్‌రెడ్డితో మరో సినిమా, అలాగే దిల్‌రాజ్- వంశీపైడిపల్లి కాంబినేషన్‌లో ఓ సినిమా, నిర్మాత భగవాన్ పుల్లారావు బ్యానర్‌లో మరో సినిమా చేయబోతున్నారు.
