పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఎన్నికల ఫలితం కోసం ఎదురుచూస్తున్నాడు. ఫలితాలను బట్టి ఆయన సినిమాల విషయంలో ఓ నిర్ణయానికి వస్తారు. అయితే ఓ ప్రాజెక్ట్ మాత్రం సెట్ చేసుకొని పెట్టుకున్నట్లు సమాచారం. 

గతంలో పవన్ తో 'గోపాల గోపాల', 'కాటమరాయుడు' సినిమాలు చేసిన దర్శకుడు డాలీ(కిషోర్ పార్థసాని) రూపొందించనున్న సినిమాలో పవన్ నటిస్తాడని చెబుతున్నారు. పవన్ కి సన్నిహితుడు, జనసేన పార్టీ తరఫున పని చేస్తోన్న ఓ నిర్మాత ఈ సినిమాను నిర్మిస్తారట. ఈ ఒక్క సినిమా మాత్రమే కాదని.. పవన్ హీరోగా సదరు నిర్మాత మూడు సినిమాలు తీయబోతున్నాడని  టాక్.

అలానే త్రివిక్రమ్, హారికా హాసిని బ్యానర్ లో కూడా పవన్ సినిమా ఉంటుందని చెబుతున్నారు. ఈ ఎన్నికల్లో జనసేన పార్టీకి చెప్పుకోదగిన సీట్లు వస్తే అప్పుడు రాజకీయాల్లో బిజీ అవుతారేమో.. లేదంటే మాత్రం సినిమాల పరంగా తన కెరీర్ కొనసాగించే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.

పవన్ చివరిగా నటించిన సినిమా 'అజ్ఞాతవాసి'. ఈ సినిమా ఆశించిన ఫలితం అందుకోలేకపోయింది. ఆ తరువాత పవన్ రాజకీయంగా బిజీ అవ్వడంతో అతడు సినిమాలకు దూరమయ్యాడు. ఆయన అభిమానులు మాత్రం పవన్ తిరిగి సినిమాల్లో నటించాలని కోరుతున్నారు.