పవన్ సినిమా వస్తోందంటే...ఫ్యాన్స్ కు వచ్చే ఆ కిక్కే వేరు. వాళ్లంతా పవన్ ఆ సినిమాలో ఏ పాత్ర చేయబోతున్నారు..ఎలాంటి డైలాగులు ఉండబోతున్నాయి. హీరోయిన్ ఎవరు..టెక్నీషియన్స్ లిస్ట్ ఏంటి వంటి విషయాలపై దృష్టి పెడతారు. మీడియా కూడా పవన్ కళ్యాణ్ సినిమా విషయాలకు బాగా ప్రయారిటీ ఇస్తుంది. ఈ నేపధ్యంలో  పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబో లో రూపొందే సినిమా గురించిన చర్చ ఫ్యాన్స్ లో మొదలైంది. అందుకు తగినట్లే మీడియాలోనూ ఈ సినిమా గురించి అప్పుడే విశేషాల వడ్డన మొదలైంది. అలాంటి ఓ కొత్త విశేషమే..పవన్...లెక్చరర్ గా కనపించబోతున్నారనేది. 

పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఎవరూ 'గబ్బర్ సింగ్' సినిమాను మర్చిపోలేరు. యాక్షన్ కి యాక్షన్.. ఎంటర్ టైన్మెంట్ కి
ఎంటర్ టైన్మెంట్ పుల్ గా వున్న సినిమా అది. అందుకే, ఆ రేంజిలో హిట్టయింది. సిని చరిత్రలో నిలిచిపోయింది. ఇప్పుడు అదే కాంబినేషన్ అవుతూండటంతో అంచనాలు రెట్టింపు అయ్యిపోయాయి.ఈ విషయం హరీశ్ శంకర్ కు కూడా తెలుసు. వాటిని అందుకోవటానికి ఆయన రాత్రింబవళ్లూ స్క్రిప్టుపై వర్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది. గబ్బర్ సింగ్ ని మించిన బ్లాక్ బస్టర్ ఇవ్వాలనే ప్లాన్ లో హరీష్ ఉన్నారట.  

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించే ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి. ఇక ఇందులో పవన్ ఎటువంటి పాత్ర పోషిస్తారనేది అభిమానులకు ఆసక్తిని కలిగించే అంశం. ఈ సినిమాలో ఆయన కాలేజీ లెక్చరర్ పాత్రను పోషిస్తారన్నది తాజా సమాచారం. ఈ పాత్ర చాలా స్పెషల్ గా డిజైన్ చేసారని,తెలుగు తెరపై చూడని విధంగా చాలా  గమ్మత్తుగా సాగుతుందని అంటున్నారు.

మరోపక్క, ప్రస్తుతం వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవన్ హీరోగా 'వకీల్ సాబ్' చిత్రం రూపొందుతున్న సంగతి విదితమే.
ఇందులో పవన్ లాయర్ పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన తాజా షెడ్యూల్ షూటింగులో పవన్
త్వరలో పాల్గొంటారు. హిందీలో హిట్టయిన 'పింక్' చిత్రం ఆధారంగా ఇది తెరకెక్కుతోంది. ఇక దీని తర్వాత పవన్ క్రిష్
సినిమా, ఆ తర్వాత హరీశ్ శంకర్ సినిమా చేస్తారని తెలుస్తోంది.