Asianet News TeluguAsianet News Telugu

#PawanKalyan:‘OG’కే పవన్ ఫస్ట్ ప్రయారిటీ...అసలు కారణం ఇదీ

‘OG’ సినిమా ప్రారంభం నుంచి అభిమానుల్లో కాదు టాలీవుడ్ లో ఉన్న క్రేజ్  రోజు రోజుకీ పెరిగిపోతోంది. ఈ ప్రాజెక్టుని, పవన్  నమ్మి నిర్మాతలు ఎంత బడ్జెట్ అయినా పెట్టడానికి రెడీ అయ్యారు. 

Pawan Kalyan to give priority to OG movie? jsp
Author
First Published Feb 25, 2024, 7:45 AM IST

పవన్ కళ్యాణ్ చేస్తున్న ,చేయబోయే సినిమాల వరస పెద్ద లిస్టే ఉంది. అందులో ఎప్పుడో మొదలైన హరి హర వీర మల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ లు ఉన్నాయి. అయితే ఎలక్షన్స్ అయ్యాక ఏ సినిమాకు మొదట ప్రయారిటీ ఇచ్చి పూర్చి చేస్తారనేది హాట్ టాపిక్ గా ఇండస్ట్రీ వర్గాల్లో మొదలైంది. అయితే అందుతున్న సమాచారం మేరకు పవన్ కళ్యాణ్ ‘OG’చిత్రానికి మొదట ప్రాముఖ్యత ఇవ్వనున్నారు. అందుకు కారణం భారీ బడ్జెట్ కావటం అని తెలుస్తోంది. దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కుతోందని వినికిడి. పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే ఇది భారీ బడ్జెట్ చిత్రం అని, దాంతో ఈ గ్యాంగస్టర్ చిత్రానికే ఫస్ట్ ప్రయారిటి ఇచ్చి పూర్తి చేయాల్సిన అవసరం ఉందని అంటున్నారు. లేకపోతే ప్రొడక్షన్ కాస్ట్ వడ్డీలుతో కలిపి చాలా పెరిగిపోతుందని, అందుకే్ మే,జూన్ నెలలలో మూడేసి వారాలు చొప్పున డేట్స్ కేటాయించి సినిమాని పూర్తి చేసేందుకు ప్లాన్ చేసారని తెలుస్తోంది. 
 
అలాగే పవన్ కళ్యాణ్ మీద నమ్మకంతో ఆల్రెడీ ఈ చిత్రం రిలీజ్ డేట్ ని సెప్టెంబర్ 27గా ఎనౌన్స్ చేసారు. ఆంధ్ర ప్రదేశ్ ఎలక్షన్ క్యాంపైన్ కోసం బ్రేక్ తీసుకున్నా, ఈ రిలీజ్ డేట్ కు ఎఫెక్ట్ కావు ని చెప్తున్నారు. విడుదల తేదీలో ఏ మార్పు లేకుండా దర్శక,నిర్మాతలు పూర్తి ప్లానింగ్ లో ఉన్నారట.‘OG’ సినిమా ప్రారంభం నుంచి అభిమానుల్లో కాదు టాలీవుడ్ లో ఉన్న క్రేజ్  రోజు రోజుకీ పెరిగిపోతోంది. ఈ ప్రాజెక్టుని, పవన్  నమ్మి నిర్మాతలు ఎంత బడ్జెట్ అయినా పెట్టడానికి రెడీ అయ్యారు. అదే లెక్కలో బిజినెస్ కూడా జరుగుతున్నట్లు ట్రేడ్ వర్గాల సమాచారం.
 
ఈ క్రమంలో .₹18 కోట్లకి #OG ఓవర్సీస్ రైట్స్ వెళ్లినట్లు తెలుస్తోంది. ఓవర్ సీస్ లో ఇది మామూలు రేటు కాదు. ఇంతకు ముందు పవన్ చేసిన భీమ్లా నాయక్ కి డబుల్ రేట్ కావంట విశేషం.  అలాగే  ఓజీ మూవీ కోసం కూడా  పవన్ కి భారీ రెమ్యునరేషన్ ఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా కోసం తన కెరీర్లోనే తొలిసారి పవన్ కల్యాణ్ రూ.100 కోట్లు వసూలు చేస్తున్నాడట. దీంతో ఇండియాలో రూ.100 కోట్లకుపైగా రెమ్యునరేషన్ అందుకుంటున్న హీరోల లిస్టులో పవర్ స్టార్ చేరిపోయాడు. సాహో ఫేమ్ సుజీత్ డైరెక్షన్ లో ఈ ఓజీ మూవీ వస్తోంది.  
 

Follow Us:
Download App:
  • android
  • ios