ప్రస్థుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్న పవన్ కళ్యాణ్ త్వరలో తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ తో సినిమా తీస్తారని టాక్ మరోవైపు జనసేన అధినేతగా రాజకీయాల్లోనూ పవన్ బిజీ బిజీ
ప్రస్థుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పిఎస్ పికె25 చిత్రంలో నటిస్తున్నారు. మమరోవైపు తమిళ స్టార్ డైరెక్టర్ సూపర్ స్టార్ మహేష్ నటించిన స్పైడర్ రిలీజ్ కు రెడీ చేసే వనిలో వున్నారు. ఈ ప్రాజెక్టుల తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్ లో క్రేజీ చిత్రం రూపొందనుందని ఫిలింనగర్ టాక్.
పవన్ కల్యాణ్‌తో త్వరలో దర్శకుడు మురుగదాస్ సినిమా చేయబోతున్నాడని గత కొంత కాలంగా ఫిలిం నగర్ లో వార్త చక్కర్లు కొడుతోంది. ఇటీవల స్పైడర్ ప్రమోషన్స్ లో పాల్గొన్న మురుగదాస్ పవన్ కల్యాణ్‌తో సినిమా గురించి కామెంట్ చేశారు. నిజానికి పవన్‌తో ఎప్పుడో సినిమా చేయాల్సిందని, గజిని సినిమా కథ కూడా ఆయనకు వినిపించానని తెలిపారు.
‘కత్తి’ సినిమా చూసి పవన్ అభినందించినట్లుగా మురుగదాస్ చెప్పుకొచ్చారు. అలాగే కత్తి కథను ఇంకా పొడిగించి వుంటే బాగుండేదని పవన్ సలహా ఇచ్చారని మురుగదాస్ చెప్పారు. కత్తి సినిమాకు సీక్వెల్ కథను సిద్ధం చేస్తున్నట్లు మురుగదాస్ చెప్పుకొచ్చారు.
ఈ కథను పవన్‌కు వినిపించే అవకాశాలున్నట్లు సమాచారం. కథ నచ్చితే మురుగదాస్‌తో పవన్ సినిమా ఖాయమని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. అయితే చేతినిండా సినిమాలతో బిజీగా వున్న పవన్.. త్వరలో సినిమాలను పక్కనబెట్టి రాజకీయాల్లోకి రానున్నారు. ఈ నేపథ్యంలో మురుగదాస్‌తో సినిమా చేస్తారో లేదో వేచి చూడాలి.
