"చెల్లెమ్మ కవిత" అంటూ ఎంపీ కవితనుద్దేశించి అన్న పవన్

First Published 10, Feb 2018, 12:27 PM IST
pawan kalyan thanks to kavitha
Highlights
  • ఎంపీ కవితపై పవర్ స్టార్ పవన్ కల్యాణ్ స్పందన
  • చెల్లెమ్మ కవిత అంటూ సంబోధించిన పవన్
  • ట్విటర్ ద్వారా కవిత గురించి పోస్ట్ పెట్టిన పవన్

 

రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలపై పార్లమెంటులో మాట్లాడిన చెల్లెలు కవిత గారికి మనస్పూర్తిగా ధన్యవాదాలు చెబుతున్నా. ' అంటూ పవన్ కల్యాణ్ తన ట్విట్టర్ ద్వారా స్పందించారు. పవన్ కల్యాణ్ ట్వీట్ కు నెటిజెన్స్ నుంచి కూడా సానుకూల స్పందన వస్తుండటం విశేషం.

 

తెలంగాణ ఎంపీ కల్వకుంట్ల కవిత గురువారం పార్లమెంటులో ఏపీకి మద్దతుగా నిలిచారు. బడ్జెట్‌పై జరిగిన చర్చలో భాగంగా.. ఆమె ఏపీ విభజన హామిల ప్రస్తావనను లేవనెత్తారు. 'ప్రభుత్వంలో ఉన్న టీడీపీ సభలో ఆందోళన చేస్తుండడం కేంద్రానికి మంచిది కాదు. ఇది తప్పుడు సందేశాన్ని పంపుతుంది.' అంటూ ఆమె వ్యాఖ్యానించారు.

 

సుమారు 10 నిమిషాల పాటు కవిత ఏపీ సమస్యల గురించి మాట్లాడారు. ఏపీ హక్కుల కోసం టీడీపీ ఎంపీలు చేస్తున్న డిమాండ్‌ న్యాయమైనదిగా చెప్పారు. తన ప్రసంగం చివరలో 'జై ఆంధ్రా' అంటూ కవిత నినదించడం కూడా చాలామంది ఏపీ ప్రజలను ఆకట్టుకుంది. 

ఈ నేపథ్యంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చెల్లెమ్మకు ధన్యవాదాలు. అంటూ ట్వీట్ చేశారు.

 

'జేఏసీ' అలా నిగ్గదీసి అడిగితే ఎటువైపు నిలబడతారు? ఏపీ విభజన హామిల అమలుపై రాజకీయ పార్టీలు ద్వంద్వ విధానాలను అనుసరిస్తుండటంతో.. జేఏసీని ఏర్పాటు చేయాలనే యోచనలో పవన్ కల్యాణ్ ఉన్న సంగతి తెలిసిందే. లోక్ సత్తా జయప్రకాశ్ నారాయణ్, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, ఆంధ్రా మేదావుల చలసాని శ్రీనివాస్ యాదవ్ వంటి వారితో జేఏసీ ఏర్పాటుకు ఆయన కసరత్తులు చేస్తున్నారు.

loader