పవన్ కళ్యాణ్ దీక్ష పై ప్రకాశ్ రాజ్ కు ఎందుకు మంట, పూనం కౌర్ బాధేంటో.. ?
ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై పగబట్టినట్టున్నారు.. నటుడు ప్రకాశ్ రాజ్ తో పాటు.. హీరోయిన్ పూనమ్ కౌర్ కూడా పేరు చెప్పకుండా టార్గెట్ చేస్తూ.. ట్రోల్ చేస్తున్నారు.
ప్రస్తుతం ఆంధ్రా రాజకీయాల్లో పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ టార్గెట్ అయ్యారు. మరీముఖ్యంగా వైసీపీ చేస్తున్న విమర్శలు గోలకంటే కూడా.. సినీనటుడు ప్రకాశ్ రాజ్ సోషల్ మీడియాలో చేస్తున్న హడావిడి ఎక్కువైపోయింది. పవన్ ను టార్గెట్ చేస్తూ.. జస్ట్ ఆస్కింగ్ అని ట్యాగ్స్ పెడుతూ అతను చేస్తున్న గోల అంతా ఇంతా కాదు. ఇన్నాళ్లు ఆంధ్రాలో జరిగిన అరాచకాల మీద కనీసం స్పందించని స్టార్ ఇప్పుడే ఏదో జరిగిందంటూ గగ్గలోలు పెడుతున్నారు.
ఇక తిరుమల లడ్డు వివాదంతో మొదలైన దాడి.. ఆతరువాత నుంచి ఏదో రకంగా పవన్ కళ్యాణ్ పై బురదజల్లే ప్రక్రియ జరుగుతూనే ఉంది. గతంలో పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్లపై కామెంట్స్ చేసిన వారు.. ఇప్పుడు పవన్ కళ్యాణ్ భార్య క్రిష్టియన్ అని.. పవన్ కూడా మతం మారారని.. ఆయన సనాతన ధర్మంగురించి మాట్లాడుతున్నాడని కామెంట్స్ చేస్తున్నారు.
తిరుమల కొండపై డిప్యూటీ సీఎం
ఇక తాజాగా పవన్ కళ్యాణ్ దీక్ష విమరమణ కోసం తిరుమల రావడం.. ఆయన కాలినడకన కొండ ఎక్కడంపై కూడా రకరకాల ట్రోల్స్ చేస్తున్నారు. పవన్ కొండ ఎక్కడానికి 5 గంటలు పట్టింది. అంత టైమ్ ఎందుకు పట్టిందని.. ఎక్కడానికి ఆపసోపాలు పడ్డాడంటూ హేళన చేస్తున్నారు. కాని పవన్ కళ్యాణ్ ఉపవాస దీక్ష చేస్తూ.. ఏమీ తినకుండా కొండ ఎక్కరు.. ఆక్రమంలో అలసట రావడం సహజం, కాని దాని గురించి కూడా విమర్శలు చేయడం.. పాయింట్ చేసి టార్గెట్ చేయడం జనాలు చూస్తున్నారు.
ఇక పవన్ కళ్యాన్ చిన్న కూతురు పలీనా అంజని కొణిదెల తో సహా తిరుమల వచ్చి డిక్లరేషన్ ఇచ్చి మరీ స్వామివారి దర్శనం చేసుకున్నారు. పవన్ మూడో భార్య.. ఆమె పిల్లలు క్రిష్టియన్స్ గా ఉన్నారు అన్నవిషయం తెలిసిందే. అయితే చిన్న కూతురు మైనర్ కావడంతో పవన్ కూడా సంతకం పెట్టినట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని కూడా రాజకీయం చేస్తున్నారు. పొలిటికల్ ప్లానింగ్ లో భాగంగానే పవన్ ఇలా చేశాడంటూ విమర్శలు చేస్తున్నారు.
అయితే పవన్ కళ్యాణ్ ఇలా డిక్లరేషన్ ఇవ్వడం వల్ల.. జగన్ టార్గెట్ అయ్యారంటూ.. పొలిటికల్ హీట్ పెరిగింది. పవన్ ఇలా డిక్లరేషన్ ఇచ్చినప్పుడు జగన్ ఇవ్వడానికి ప్రాబ్లమ్ ఏంటీ..? జగన్ కూడా తిరుమల వచ్చి డిక్లరేషన్ పై సంతకం పెట్టడానికి ప్రాబ్లమ్ ఏంటీ అని ప్రశ్నలు ఎదురవుతున్నాయి. మతం సంగతి పక్కన పెడితే.. దేవుడిపై నమ్మకం ఉంది అని డిక్లేర్ చేయడానికి ప్రాబ్లామ్ ఏంటీ అని అడుగుతున్నారు భాక్తులు.
పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసిన ప్రకాశ్ రాజ్.
ఈక్రమంలో లడ్డు వివాదం దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేశారు ప్రకాశ్ రాజ్. తిరుమల లడ్డు వివాదం ఎప్పుడైతే మొదలైందో అప్పటి నుంచి ప్రకాష్ రాజ్ తన మార్క్ ట్వీట్లతో పవన్ ను టార్గెట్ చేశారు. మొదటగా ప్రకాశ్ రాజ్ పెట్టిన ట్వీట్ కు పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. లడ్డు వివాదం పై పవన్ మాట్లాడుతూ.. ప్రకాష్ రాజ్ కు ఏం సంబంధం.? ఆయన ఎందుకు మాట్లాడుతున్నాడు.? అంటూ ఫైర్ అయ్యారు.
ఇక దానికి సమాధానంగా ప్రకాష్ రాజ్ వీడియో రిలీజ్ చేశారు. నేను చేసిన ట్వీట్ ను మీరు సరిగ్గా అర్ధం చేసుకోలేదు. నేను షూటింగ్ కోసం విదేశాల్లో ఉన్నాను.. వచ్చిన తరువాత చెపుతాను అని అన్నారు. కాని ప్రకాష్ రాజ్ అంతటితో ఆగలేదు... మ్యాటర్ మరింత వైరల్ అయ్యేలా వరుస ట్వీట్లు చేశారు. ఈ విషయాన్ని ఇంతటితో వదిలిపెట్టకుండా వరుసగా ట్వీట్లు వదులుతూనే ఉన్నారు ప్రకాశ్ రాజ్. పవన్ ప్రతీ మూమెంట్ పై విమర్శలతో ట్వీట్లు చేస్తూ.. పేరు బటయ పెట్టకుండా.. జస్ట్ ఆస్కింగ్ ట్యాగ్ తగిలిస్తున్నారు.
దేవుడిని రాజకీయాల్లోకి లాగొద్దు అని అంటున్న ప్రకాష్ రాజ్.. గెలిచేముందు ఒక అవతారం.. గెలిచిన తర్వాత ఇంకో అవతారం.. ఏంటీ అవాంతరం.. ఏందుకు మనకీ అయోమయం ఏది నిజం? జస్ట్ ఆస్కింగ్” అంటూ.. అలాగే ” మనకేం కావాలి.. ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టి ..తద్వారా రాజకీయ లబ్ధిని సాధించటమా..? లేక ప్రజల మనోభావాలు గాయపడకుండా.. పరిపాలనా సంబంధమైన..అవసరమైతే తీవ్రమైన చర్యలతో.. సున్నితంగా సమస్యను పరిష్కరించుకోవటమా..? జస్ట్ ఆస్కింగ్” అంటూ ప్రకాశ్ రాజ్ రకరకాలు ట్వీట్లు పెడుతూ వచ్చారు.
రెచ్చిపోతున్న ప్రకాశ్ రాజ్..
అంతే కాదు రీసెంట్ గా ప్రకాశ్ రాజ్ ఇంకాస్త శృతిమించుతూ.. రెచ్చగొట్టేలా మరో ట్వీట్ కూడా పెట్టారు. “కొత్త భక్తుడికి పంగనామాలెక్కువ ! .. కదా ?. … ఇక చాలు… ప్రజల కోసం చెయ్యవలసిన పనులు చూడండి”అని పోస్ట్ చేశారు ప్రకాష్ రాజ్. దీంతో ప్రకాశ్ రాజ్ పై పవన్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అంతే కాదు.. ఇదే అదనుగా వైసీపి ప్రకాశ్ రాజ్ ను అడ్డు పెట్టుకుని పవన్ పై మరింత దాడి పెంచింది. ఈ క్రమంలో ఇప్పుడు మరోసారి ట్వీట్ చేశారు ప్రకాశ్ రాజ్.
గాంధీ జయంతి, లాల్ బహుదూర్ శాస్త్రి జయంతికి విషెస్ తెలుపుతూనే.. తన విమర్శను కొనసాగించారు. ఒకవేళ నువ్వు మైనారిటీలో భాగమైనప్పటికీ.. నిజం ఎప్పటికీ నిజమే” అని గాంధీజి చెప్పిన మాటలను, అలాగే ” ఆలయాలు, మసీదులు, గురుద్వారాలు, చర్చిలు మనకు ఉన్నాయి. కానీ వాటిని మనం రాజకీయాల్లోకి తీసుకురాము. ఇదే మనకు, పాకిస్థాన్‌కు ఉన్న తేడా” అని లాల్‌బహదూర్ శాస్త్రి చెప్పిన సూక్తిని పోస్ట్ చేశారు ప్రకాశ్ రాజ్. ఈ పోస్ట్ పవన్ ను విమర్శిస్తూ చేసిందే అని అంటున్నారు.
పవన్ తిరుమల పర్యటనపై పూనం కౌర్ ట్వీట్
పవన్‌కల్యాణ్‌కు ప్రకాశ్ రాజ్ తో పాటు హీరోయిన్ పూనం కౌర్ కూడా కంట్లో నలుసులా తయారయ్యారు. ప్రకాశ్‌రాజ్ ట్వీట్ లు చాలవన్నట్టు .. అటు పూనమ్ కౌర్ కూడా ఇన్‌డైరెక్ట్‌గా పవన్‌కు, ఆయన స్నేహితుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పై విమర్శలు చేస్తూ.. ట్వీట్లు పెడుతున్నారు. సినిమాలకు దూరంగా ఉంటున్నా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉంది పూనమ్. పవన్, త్రివిక్రమ్‌లపై ఎప్పటికప్పుడు ఏదో ఒక పోస్ట్ పెడుతుంటుంది పూనం. తాజాగా పవన్‌ను విమర్శిస్తూ పూనమ్ ఓ ట్వీట్ చేశారు. పవన్ తిరుమల పర్యటనను ఆమె విమర్శించారు.
ఆమె ట్వీట్ లో ఏమన్నారంటే.. ‘ప్రతి ఒక్కరికి కుమార్తె ముఖ్యమే’ అంటూ పూనమ్ తన ఎక్స్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. ఇద్దరు కూతుళ్లతో కలిసి పవన్ తిరుమలకు వెళ్లారు. ఈ నేపథ్యంలోనే ఇది పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి చేసిన ట్వీట్ అని అందరికి అర్ధం అవుతోంది. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. పనన్ కల్యాణ్ తన చిన్న కుమార్తె కి తిరుమల శ్రీవారి దర్శనానికి డిక్లరేషన్ ఇచ్చారు. తర్వాత ఇద్దరు కూతుళ్లతో కలిసి శ్రీవారిని దర్శిచుకున్నారు పవన్ కళ్యాణ్.
బిగ్ బాస్ అప్ డేట్స్ కోసం క్లిక్ చేయండి.
ఈవివాదం ఇంతటితో ముగిసేలా లేదు. ప్రకాశ్ రాజ్ లాంటివారు రెచ్చిపోతుండటంతో.. వైసీపీ ఇదే అదనుగా గాయాన్ని పెద్దది చేసే ప్రయత్నం చేస్తున్నారు. దానికి తోడు సుప్రీం కోర్డు వాఖ్యలను అడ్డం పెట్టుకుని పవన్ పై దాడిని పెంచారు. ఈక్రమంలో పోసాని, శ్యామలతో పాటు..మరికొంత మంది సినిమా వాళ్లను రంగంలోకి దింపే ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం.