`భీమ్లా నాయక్‌` చిత్రం నుంచి రేపు(బుధవారం) ఉదయం 11 గంటలకు అప్‌డేట్‌ రాబోతుంది. అయితే ఎలాంటి అప్‌డేట్ ఇవ్వబోతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సినిమా నుంచి టీజర్‌ లాంటిది రాబోతుందని భావిస్తున్నారు ఫ్యాన్స్. 

పవన్ కళ్యాణ్‌(Pawan Kalyan) అభిమానులకు సర్ప్రైజ్‌ ఇవ్వబోతున్నారు. తాను నటిస్తున్న `భీమ్లా నాయక్‌`(Bheemla Nayak) నుంచి మరో ట్రీట్ రాబోతుంది. రేపు ఈ విషయాన్ని స్పష్టం చేయబోతుంది చిత్ర బృందం. `బ్లాస్టింగ్‌ అప్‌డేట్‌ రెడీ అవుతుంది` అని పేర్కొంది యూనిట్. రేపు(బుధవారం) ఉదయం 11 గంటలకు ఈ అప్‌డేట్‌ విషయాలను పంచుకోనున్నారట. అయితే ఎలాంటి అప్‌డేట్ ఇవ్వబోతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సినిమా నుంచి టీజర్‌ లాంటిది రాబోతుందని భావిస్తున్నారు ఫ్యాన్స్.

Scroll to load tweet…

Bheemla Nayak చిత్రంలో నుంచి ఫస్ట్ లుక్‌లు, రెండు పాటలు, పవన్‌ నటిస్తున్న భీమ్లా నాయక్‌ పాత్ర గ్లింప్స్, రానా(Rana) నటిస్తున్న డేనియల్ శేఖర్‌ పాత్ర గ్లింప్స్ లను విడుదల చేయగా, వాటికి మంచి స్పందన లభించింది. మిలియన్‌వ్యూస్‌తో దూసుకుపోయాయి. సినిమాపై అంచనాలను పెంచాయి. తెలుగులో దీనికి భారీ హైప్‌ వచ్చింది. Pawan Kalyan, Rana పాత్రల యాటిట్యూడ్‌, వీరిద్దరి మధ్య జరిగే ఘర్షణ వంటి అంశాలు పోటాపోటీగా ఉండబోతున్నాయని, ఫ్యాన్స్ కి పర్‌ఫెక్ట్ ట్రీట్‌గా ఉండనున్నాయని తెలుస్తుంది.

`భీమ్లా నాయక్‌` మలయాళంలో సూపర్‌ హిట్‌ అయిన `అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌` చిత్రానికి రీమేక్‌ అనే విషయం తెలిసిందే. సినిమాకి సాగర్‌ కే చంద్ర దర్శకత్వం వహిస్తుండగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ మాటలు, స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇందులో పవన్ కళ్యాణ్‌ సరసన నిత్యా మీనన్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. మరోవైపు రానా సరసన సంయుక్త మీనన్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయబోతున్నారు.

ఇదిలా ఉంటే ఈ సినిమా వాయిదా పడే అవకాశం ఉందనే వార్త వినిపిస్తుంది. `ఆర్‌ఆర్‌ఆర్‌` సినిమా జనవరి 7న రిలీజ్‌ కానుంది. ఇది ఇండియాతోపాటు పలు ఇతర దేశాల్లోనూ రిలీజ్‌ చేస్తున్నారు. ఈ సినిమా రిలీజైన ఐదు రోజులకే `భీమ్లానాయక్‌` రాబోతుంది. దీంతో కలెక్షన్లపై ప్రభావం పడుతుంది. అటు `ఆర్ఆర్‌ఆర్‌`కి, ఇటు `భీమ్లానాయక్‌` కలెక్షన్లపై ఆ ప్రభావం ఉంటుంది. దీంతో నిర్మాతల మధ్య జరిగిన చర్చల్లో భాగంగా ఈ సినిమాని వాయిదా వేయబోతున్నట్టు తెలుస్తుంది. ఆ క్లారిటీ కూడా రేపు చిత్ర బృందం ఇవ్వబోతుందని సమాచారం. అయితే సినిమాని ఫిబ్రవరిలోగానీ, మార్చిలోగానీ రిలీజ్‌ చేసే ఆలోచనలో ఉన్నారట. నిజానికి ఈ సినిమా ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ సెకండ్‌ వేవ్‌ కరోనా వల్ల షూటింగ్‌ వాయిదా పడటంతో అది రిలీజ్‌ డేట్‌పై ప్రభావం పడింది. దీంతో సినిమాని సంక్రాంతి బరిలోకి దించారు. మహేష్‌, ప్రభాస్‌లతో పోటీగా ఈ సినిమాని రిలీజ్‌చేయాలని భావించారు. కానీ ఇప్పుడు సంక్రాంతి బరి నుంచి తప్పుకునే ఛాన్స్ ఉందట.

also read: ఆర్ ఆర్ ఆర్ కి దారిచ్చిన పవన్, మహేష్... ప్రభాస్ మాత్రం ఢీ!