బన్నీ ఎదుగుదల ఆనందాన్నిస్తోంది: పవన్ కళ్యాణ్

First Published 10, May 2018, 9:22 PM IST
pawan kalyan speech at na peru surya movie thank you meet
Highlights

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' సినిమా ఇటీవల

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. వక్కంతం వంశీ డైరెక్ట్ చేసిన ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ ను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బన్నీను, చిత్రబృందాన్ని ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. 

''ఈ సినిమా చూడాలని ఎంతగానో ఉంది. నేను పర్యటనకు వెళ్ళకముందే ఈ సినిమా చూస్తా.. ఈ సినిమా ట్రైలర్ చూసినప్పుడు చాలా బావుందనిపించింది. వక్కంతం వంశీ నాకు చాలా కాలంగా తెలుసు. నేను కొమరం పులి సినిమా చేసే సమయంలో నన్ను కలిసి కథ చెప్పారు. కానీ అది ముందుకు వెళ్ళలేదు. కానీ ఇప్పుడు బన్నీతో దర్శకుడిగా మంచి సినిమా చేయడం ఆనందంగా ఉంది. ఈ సినిమాకు మా అన్నయ్య నాగబాబు ప్రొడ్యూసర్ అనే విషయం నాకు ఇక్కడకి వచ్చేవరకు తెలియదు. తను నిర్మాతగా సినిమాలు చేస్తే నాకు చెప్పడు. బన్నీ నటించిన ఆర్య సినిమా అంటే నాకు చాలా ఇష్టం. అతడి ఎదుగుదల నాకు ఆనందాన్నిచ్చింది. మరిన్ని మంచి సినిమాలు చేసి తల్లితండ్రులకు, తాతగారికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నా..' అని వెల్లడించారు. తన సినిమా ఫంక్షన్ కు వచ్చి ఆశీర్వదించిన పవన్ కళ్యాణ్ కు బన్నీ ధన్యవాదాలు తెలియజేశారు.

loader