గెట్ రెడీ పవర్ స్టార్ ఫ్యాన్స్ .. పూనకాలు తెప్పించే న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఎప్పుడెప్పుడా అని అభిమానులు ఎదురు చూసే పవన్ వారసుడి ఎంట్రీ త్వరలోనే అనే మాటల వినిపిస్తుంది.
టాలీవుడ్ ప్రస్తుతం ప్రయోగాలకు.. సరికొత్త సరికొత్త కాంబినేషన్స్ కు అడ్డాగా మారిపోయింది. పనిలో పనిగా వారసులను కూడా రంగంలోకి దింపుతూ ఉంది. చాలా కాలంగా బాలయ్య అభిమానులు ఆయన వారసుడి ఎంట్రీకి ఎదురు చూస్తుంటే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు అఖీరా ఎంట్రీకి ఎదురుచూస్తున్నారు. ఇక తాజా సమాచారం ప్రకారం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. కొడుకు అకిరానందన్ ఎంట్రీ అతీ త్వరలో జరగబోతున్నట్టు తెలుస్తోంది. అది కూడా సుజీత్ దర్శకత్వంలో OG సినిమాతో వీరిద్దరి ఎంట్రీ ఖాయమంటూ వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తల్లో నిజం ఎంత...?
థియేటర్లో.. అభిమాన హీరో కనిపిస్తే పూనకాలతో ఊగిపోతుంటారు ఫ్యాన్స్...ఇద్దరు స్టార్లు కనిసి ఒక సినిమాలో కనిపిస్తే.. రచ్చ రచ్చ చేస్తుంటారు. అదే అభిమాన నటుడు మల్టీ స్టారర్ చేస్తూ.. ఆ మల్టీ స్టారర్ లో కూడా తమ అభిమాన నటుడి వారసుడు కనిపిస్తే.. స్క్రీన్లు చినిగిపోవాల్సిందే. ఇక ఇప్పుడు ఇలాంటి కాంబినేషన్ నే ఫ్యాన్స్ త్వరలో చూడబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. కొడుకు అకిరా నందన్ తో కలిసి నటిస్తాడనే వార్త ప్రస్తుతం టాలీవుడ్ లో చక్కర్లు కొడుతున్నాయి.
సాహో ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో OG సినిమాలో ఇద్దరు సందడిచేస్తారని తెలుస్తోంది. ఈసినిమాతోనే అఖీరా ఎంట్రీ ఖాయం అంటున్నారు సినీ జనాలు. మరి ఈ వార్త ఎంతవరకు నిజం ఉంది అనేది మాత్రం తెలియాల్సి ఉంది. సుజీత్ దర్శకత్వంలో OG సినిమా చేస్తున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ముంబై లో పూర్తి చేసుకుంది.. ఇక ప్రస్తుతం మహాబలేశ్వరంలో సెకండ్ షెడ్యూల్ ను ప్లాన్ చేసుకుంది టీమ్. ఈ షెడ్యూల్ లో త్వరలో పవన్ జాయిన్ కాబోతున్నారు. ఈసినిమాలో మూడు డిఫరెంట్ రోల్స్ ను పవన్ కళ్యాణ్ పోషించబోతున్నారట. ఒకటి మాఫియా డాన్ పాత్ర కాగా, మరొకటి కాలేజ్ లెక్చరర్ రోల్. ఇక టీనేజ్ కుర్రాడిగా కూడా పవన్ ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో కనిపిస్తారని వినికిడి. అయితే ఈ రోల్ కోసం డైరెక్టర్ సుజీత్.. అకిరా నందన్ ని తీసుకోవాలి అని ప్రపోజల్ పెట్టాడ.
అయితే ఈ విషయంలో పవన్ కళ్యాణ్ ఇంతవరకూ ఏ నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. ఒక వేళ పవన్ దీనిక ఓకే చెప్పి.. అఖీరా కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. ఓజీతో అకీరా టాలీవుడ్ ఎంట్రీ ఖాయం అయినట్టే. అకిరా నందన్ ది ఇదే డెబ్యూ మూవీ కూడా అవుతుంది. అంతే కాదు తన తండ్రితో కలిసి వెండితెర ఎంట్రీ ఇచ్చినట్టు అవుతుంది. ఇప్పటికే ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు అకీరా ఎంట్రీ అని ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ వార్త నిజమైతే ఫ్యాన్స్ కి పూనకాలు రావడం ఖాయం. చూడాలి మరి ఏం జరుగుతుందో.
