వదిన ఆ రోజు చేసిన ద్రోహం కారణంగానే నేనిక్కడున్నా.. వదిన సురేఖపై పవన్ సంచలన వ్యాఖ్యలు..
తనకు సినిమాల్లోకి రావడం ఇష్టం లేదని, తాను ఎప్పుడూ అనుకోలేదని, ఏదో చిన్న ఉద్యోగం చేస్తూ, పొలం పనులు చేసుకోవాలనుకున్నా. కానీ వదినే తనని ఒత్తిడి చేసిందన్నారు పవన్.

పవన్ కళ్యాణ్.. తన వదిన సురేఖపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె చేసిన ద్రోహం కారణంగా తాను ఇక్కడున్నానని తెలిపారు. `బ్రో` ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకలో ఆయన ఈ వ్యాఖ్యలు తెలిపారు. తనకు సినిమాల్లోకి రావడం ఇష్టం లేదని, తాను ఎప్పుడూ అనుకోలేదని, ఏదో చిన్న ఉద్యోగం చేస్తూ, పొలం పనులు చేసుకోవాలనుకున్నా. అన్నయ చిరంజీవి మెగాస్టార్‌గా ఇమేజ్ పొంది పీక్‌లో ఉన్నప్పుడు హీరో అవుతావా? అంటే భయమేసింది. తాను చేయగలనా అనిపించింది.
కానీ మనల్ని నమ్మేవ్యక్తులు ఇంపార్టెంట్. వదిన సురేఖ నన్ను నమ్మింది. ఆమె సినిమాలు చేయమని ప్రోత్సహించింది. ఓ సారి జగదాంబ థియేటర్ వద్ద బస్ ఎక్కి డాన్సు చేయమన్నారు. ఆ రోజు డాన్సు చేయడానికి నేను చచ్చిపోయాను. ఆ రోజు ఫోన్ చేసి మా వదినని అడిగాను. నన్ను ఎందుకు ఇలా చేశామని నిలదీశాను. ఆమె ఆ రోజు చేసిన తప్పు కారణంగానే ఇప్పుడు నేను ఇలా మీ ముందు నిల్చున్నాను. దీనంతటికి కారణం వదిన చేసిన ద్రోహమే అని వ్యాఖ్యానించారు పవన్ కళ్యాణ్. ఫన్నీ వేలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
పవన్ కళ్యాణ్ ఇంకా మాట్లాడుతూ, తాను ఈ స్టేజ్‌ని ఊహించుకోలేదన్నారు. ఇంతటి, ప్రేమ అభిమానం చూస్తేంటే ఇది కలా, నిజమా అనిపిస్తుందన్నారు. ఇది నేను కోరుకున్న జీవితం కాదని, ఆ భగవంతుడు తనకు ఇవ్వబడిన జీవితం అన్నారు పవన్. ఏదో చిన్న జీవితాన్ని గడపాలనుకున్నా, కానీ కోట్లాది మంది అభిమానులను పొందడం తన అదృష్టమన్నారు. ఈ అభిమానానికి థ్యాంక్స్ అని మాటల్లో చెప్పలేనని తెలిపారు. తనకు మాటలు చెప్పడం రాదని, సామాజం పరంగా ఏదైనా తిరిగి ఇవ్వాలనుకుంటానన్నారు.
తాను చేసే సినిమాల్లో సమాజానికి ఏదో మంచి ఇచ్చేదిగా, సందేశం ఇచ్చేదిగా ఉండాలని కోరుకుంటాను. అందుకు `బ్రో` మూవీ సంపూర్ణమైనదన్నారు పవన్. ఈ సినిమా తాను విచిత్రమైన పరిస్థితుల్లో ఉన్న సమయంలో వచ్చిందన్నారు. ఇటు సినిమాలు చేయలేక, అటు రాజకీయాల్లోకి వెళ్లలేని కరోనా సమయంలో వచ్చిందన్నారు. త్రివిక్రమ్ ఫోన్ చేసి ఈ కథ చెప్పారని, ఆయన చెప్పడంతో సముద్రఖనిని నమ్మాననని తెలిపారు. ఆయన ఈ సినిమా చేస్తున్న సమయంలో తెలుగు నేర్చుకున్నారని తెలిపారు. ఆయన పట్టుదలకి హ్యాట్సాప్ చెప్పారు.
ఈ సినిమా 70 రోజుల్లో చేయగలిగే చిత్రం. కానీ సముద్రఖనిగారు ప్లానింగ్‌తో కేవలం 21 రోజుల్లో చేశారు. ఆయన డెడికేషన్ హ్యాట్సాప్ చెప్పారు పవన్.