మేనల్లుడితో పవన్ కళ్యాణ్ సినిమా..?

https://static.asianetnews.com/images/authors/74ce1d03-f84b-5b8e-abc1-c43c5f7c8632.jpg
First Published 5, Sep 2018, 4:24 PM IST
pawan kalyan sets director dolly for vaishnav tej
Highlights

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ రాజకీయాలపై దృష్టి పెట్టాడు. తన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ అంటే పవన్ కి బాగా ఇష్టం. అతడి కెరీర్ ఆరంభంలో పవన్ కొన్ని జాగ్రత్తలు తీసుకున్నారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ రాజకీయాలపై దృష్టి పెట్టాడు. తన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ అంటే పవన్ కి బాగా ఇష్టం. అతడి కెరీర్ ఆరంభంలో పవన్ కొన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఇప్పుడు రెండో మేనల్లుడు కూడా సినిమా ఇండస్ట్రీకి పరిచయం కానున్నాడు.

అతడే సాయి ధరమ్ తేజ్ తమ్మడు వైష్ణవ్ తేజ్. అతడిని హీరోగా నిలబెట్టే ప్రాసెస్ లో పవన్ ఇప్పటినుండే కేర్ తీసుకుంటున్నాడని టాక్. దీనికోసం పవన్ తనతో రెండు సినిమాలు చేసిన దర్శకుడు డాలీ, అలానే 'నేల టికెట్టు' ప్రొడ్యూసర్ రామ్ తాళ్లూరి కాంబినేషన్ లో వైష్ణవ్ తేజ్ హీరోగా ఓ సినిమా చేయాలని భావిస్తున్నాడట.

పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మించబోతున్నారు. వచ్చే ఏడాది ఆరంభంలో ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకువెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు. ఈలోగా వైష్ణవ్ తేజ్.. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు డైరెక్ట్ చేసే సినిమాతో హీరోగా పరిచయం కానున్నాడు. ఈ సినిమాను సుకుమార్, మైత్రి మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మించనున్నారు. 

loader