దీపావళి సందర్భంగా సూపర్‌ స్టార్ మహేష్‌ కొంత మంది సినీ ప్రముఖులకు గిఫ్ట్ లు బహుమతులుగా పంపించి సర్‌ప్రైజ్‌ చేసిన విషయం తెలిసిందే. తాజాగా పవన్‌ సైతం సర్‌ప్రైజ్‌ చేశారు. మహేష్‌బాబు ఫ్యామిలీకి, బండ్ల గణేష్‌ వంటి వారికి క్రిస్మస్‌ కానుకలు అందించారు. వారిని సర్‌ప్రైజ్‌కి గురి చేశారు. క్రిస్మస్‌ వేడుకల్లో భాగంగా పవన్‌ కళ్‌యాణ్‌, ఆయన భార్య అన్నా లెజ్‌నేవా కలిసి మహేష్‌ ఫ్యామిలీకి బహుమతులు అందజేశారు. 

ఈ విషయాన్ని నమ్రత తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా తెలిపింది. ఈ సందర్భంగా పవన్‌కి, ఆయన భార్య అన్నాకి ప్రత్యేకంగా ధన్వవాదాలు తెలియజేసింది. ఇదిలా ఉంటే ఇరువురి బర్త్ డే టైమ్‌లో పవన్‌, మహేష్‌బాబు ఒకరినొకరు విషెస్‌ తెలియజేసుకున్నారు. ఇప్పుడు ఏకంగా క్రిస్మస్‌ గిఫ్టులు పంపండంతో ఫ్యాన్స్ ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. అంతేకాదు సోషల్‌ మీడియాలో దీన్ని ట్రెండ్‌ చేస్తున్నారు. 

మరోవైపు నిర్మాత బండ్ల గణేష్‌కి సైతం పవన్‌ గిఫ్ట్ పంపించాడు. దీంతో ఆయన ఆనందానికి అవద్దుల్లేకుండా పోయాయి. ఈ సందర్భంగా బండ్ల గణేష్‌ ట్విట్టర్‌ ద్వారా స్పందిస్తూ, `మీ ప్రేమకి నేనెప్పుడూ బానిస నే బాస్‌ అంటూ పవన్‌ కళ్యాణ్‌ నా దేవుడు` అని పేర్కొన్నాడు. మరోవైపు ప్రముఖ సినిమా పోస్టర్‌ డిజైనర్‌ అనిల్‌ భాను కలిసి పవన్‌కి ఆర్ట్ డిజైన్‌ని బహుమతిగా అందించారు. ఈ విషయాన్ని పవన్‌ ఇస్టా ద్వారా పంచుకున్నారు. 

ప్రస్తుతం పవన్‌ కళ్యాణ్‌ `వకీల్‌ సాబ్‌` షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. ఇది అటవి ప్రాంతంలో షూటింగ్‌ జరుపుకుంటోంది. ఈ సందర్భంగా అక్కడి ఆదివాసీలు పాడిన ఓ పాటని ట్విట్టర్‌ ద్వారా పంచుకున్న విషయం తెలిసిందే. దీంతోపాటు మలయాళ సూపర్‌ హిట్‌ చిత్రం `అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌` రీమేక్‌లో నటించనున్నాడు. ఇది ఇటీవలే ప్రారంభమైంది. ఇందులో రానా మరో హీరోగా నటిస్తున్నారు. దీనికి సాగర్‌ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. 

మరోవైపు మహేష్‌ `సర్కారు వారి పాట` చిత్రంలో నటించబోతున్నారు. ఇది కూడా త్వరలోనే రెగ్యులర్‌ షూటింగ్‌ని ప్రారంభించుకోబోతుంది. దీనికి పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే `భీష్మ` డైరెక్టర్‌ వెంకీ కుడుములతో ఓ సినిమా చేయబోతున్నట్టు టాక్‌.