జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ,ప్రముఖ తెలుగు మీడియా ఛానల్ ఏబీఎన్ అధినేత వేమూరి రాధాకృష్ణ ల మధ్య గత కొన్ని రోజులుగా ట్విట్టర్ వేదికగా వార్ కొనసాగుతున్న సంగతి తెల్సిందే .అందులో భాగంగా తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వేమూరి రాధాకృష్ణకు సరికొత్త బిరుదునిచ్చారు.

పవన్ ఇచ్చిన ఈ బిరుదు ప్రస్తుతం సోషల్ మీడియా అండ్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో వైరల్ అవుతుంది .ఈ క్రమంలో ఏబీఎన్ ఎండీ వేమూరి రాధాకృష్ణను ఉద్దేశిస్తూ బూతు జ్యోతిరత్న ఆర్కే అనే బిరుదునిస్తున్నట్లు ట్విట్టర్ సాక్షిగా పవన్ ట్వీట్ చేశాడు .భారతరాజ్యాంగంలో ఉన్న మాదిరిగా ముందు మాటలో మేము దేవుడ్ని నమ్ముతాం అని ఉంటుంది .

టీడీపీ రాజ్యాంగంలో ముందు మాటలో మేము దూషణలను నమ్ముతాం అని ఉంటుంది ..మిగతా అంతా సేమ్ టూ సేమ్ అని పవన్ ట్వీట్ చేశాడు ..టీడీపీలో తల్లిని చెల్లిని తిట్టే విభాగానికి ప్రధాన కార్యదర్శి ఎవరో తెలుసా ..ఇంకా ఎవరు బూతు జ్యోతి రత్న ఆర్కే అని ట్వీట్ చేశాడు ..