Asianet News TeluguAsianet News Telugu

కత్తి ‌- పెన్ను, పవన్ కళ్యాణ్ అన్నప్రాసనలో ఏది పట్టుకున్నాడు..? అంజననాదేవి చెప్పిన టాప్ సీక్రెట్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఆయన తల్లి అంజనాదేవి ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. పవన్ కళ్యాణ్ యొక్క దీక్షలు, అన్న ప్రాసన, చిరంజీవితో అనుబంధం వంటి విషయాలను ఆమె గుర్తు చేసుకున్నారు. నటుడిగా, వ్యక్తిగా పవన్ ఎదుగుదల చూసి తాను ఎంతో సంతోషంగా ఉన్నానని అన్నారు.

Pawan Kalyan: Secrets Revealed by His Mother Anjanadevi JmS
Author
First Published Oct 3, 2024, 6:09 PM IST | Last Updated Oct 3, 2024, 6:09 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారు.. ఆయన అమ్మగారు అంజనాదేవి. ఇప్పటి వరకూ పవన్ ఫ్యాన్స్ కు తెలియని ఎన్నో విషయాలు ఆమె వెల్లడించారు. 

ప్రస్తుతం రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతున్నారు ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం  పవన్‌ కల్యాణ్‌. మరీముఖ్యంగా తిరుమల లడ్డు, పవన్ దీక్ష విషయంలో విమర్శలు ఎదుర్కొన్నా.. తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నాడు. తాజాగా తమిళమీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూతో అవర ఆడియన్స్ అభిమానం కూడా సంపాదించుకున్నాడు. 

తిరుమల వివాదంతో పాటు.. క్రిష్టియానిటీ గురించి వివాదాన్ని ఎదుర్కొంటున్నాడు పవన్. ఇక ఈ విషయంలో ప్రకాశ్ రాజ్ తో పాటు వైసీపీ బ్యాచ్ పవన్ ను టార్గెట్ చేసి రకరకాల విమర్శలు చేస్తున్నారు. ట్విట్టర్ వేదికగా పవన్ కళ్యాన్ పై దారుణమైన దాడి జరుగుతుంది. కాని అవేమి పట్టిచుకోకుండా పవన్ కళ్యాణ్ తన పని తాను చేసుకుపోతున్నాడు. ఈక్రమంలో పవన్ కళ్యాణ్ గురించి ఆయన అమ్మగారు అంజనాదేవి ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. 

అమ్మ కోసం దీక్ష తీసుకున్న పవన్ కళ్యాణ్ 

పవన్ గురించి ఆయన  అమ్మగారు అంజనాదేవి మాట్లాడుతూ..  ఇప్పటి వరకు ప్రజలకు తెలియని ఎన్నో  విషయాలు చెప్పారు. ప్రస్తుతం ఆయన వరుసగా  దీక్షలు చేస్తూ.. మాలలు వేసుకుంటూ.. ఉపవాసాలు చేస్తూ.. భక్తి లో ముగిని తేలుతున్నారు. అయితే ఆయనకు  దీక్షలు కొత్త కాదు అన్నారు అంజనాదేవి. పవన్‌కు చిన్నప్పుట్నుంచే ఆ  అలవాటు ఉంది అన్నారు. పవన్ ఎంతో దీక్షగా అయ్యప్ప మాల వేసుకునేవాడని ఆమె చెప్పారు. 

అంతే కాదు ప్రత్యేకంగా తన కోసమే పనవ్ దీక్ష తీసుకున్నాడని అన్నారు పవన్ తల్లిగారు.  అయ్యప్ప దర్శనానికి నేను వెళ్లాలి నాన్న అని ఓసారి అడిగితే.. నా  కోసం అయ్యప్ప మాల వేసుకున్నాడు. 40 రోజులు నిష్టగా ఉన్నాడు. ఆ తర్వాత శబరిమల వెళ్ళి  దర్శనం చేసుకుని వచ్చాం' అని అంజనాదేవి తెలిపారు.  ఈ స్థాయికి చేరుకోవడానికి పవన్‌ ఎంతో కష్టపడ్డాడని, ఎంత కష్టపడ్డాడో భగవంతుడు అంత మంచి అదృష్టం ఇచ్చాడని, ప్రజలకే సేవ చేసే భాగ్యాన్ని ప్రసాదించాడని అంజనాదేవి  ఆనందంతె వెల్లడించారు. 

Pawan Kalyan: Secrets Revealed by His Mother Anjanadevi JmS

అన్న ప్రాసనరోజు కత్తి పట్టుకున్న పవర్ స్టార్ 

పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ.. ఆమె ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని శేర్ చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ అన్న ప్రాసన ఎలా జరిగింది. అనే విషయాన్ని వివరించారు. అంజనాదేవి మాట్లాడుతూ.. మేము ఒకసారి తిరుమల స్వామివారి దర్శనానికి వెళ్లాము. అప్పటికిర పవన్ కళ్యాణ్ వయస్సు ఆరు నెలలు. ఎలాగు ఆరోనెల వచ్చింది కదా.. తిరుమల వచ్చాము కదా.. ఇక ఇక్కడే అన్న ప్రాసన చేద్దాం అని అనుకున్నాము. 

నాకు మనసులో అనిపించింది.. వెంటనే పవన్ నాన్నగారు శ్రీ వెంకట్రావు గారితో చెప్పాను. ఆయన కూడా అంత కంటే అదృష్టం ఏముంటుంది చేసేద్దాం అని అన్నారు. తిరుమలలో యోగ నరసింహస్వామి వద్ద పడుకోబెట్టి చేసేద్దామండి అన్నాను. ఆయన పోలీసు అవడం వల్ల ఆ రోజుల్లో ఆయన దగ్గర ఎప్పుడూ చిన్నపాటి కత్తి ఉండేది. ఆ కత్తి, పెన్ను, పుస్తకాలు, దేవుడి ప్రసాదం పెట్టి పవన్ కు  అన్నప్రాసన చేస్తే.. పవన్ ముందు కత్తి పట్టుకున్నాడు. తర్వాత పెన్ను పట్టుకున్నాడు' అని అంజనాదేవి అప్పటి విషయాలు గుర్తు చేసుకున్నారు. 

ఇక కత్తి పట్టుకున్నాడు కదా  పిల్లాడు కోపిష్టి అవుతాడు లేదంటే పది మందికి మంచి చేసేవాడు అవుతాడు అని అప్పుడే మేము అనుకున్నాము. అన్నట్టుగానే పవన్ కళ్యాన్ ప్రజాసేవలో ఉన్నాడు. ఉన్నత స్థాయికి ఎదిగాడు. ఇప్పుడు అతను చేస్తున్న పని చూసి చాలా సంతోషంగా ఉంది అన్నారు అంజనాదేవి. 

పవన్ కష్టం చూసి తల్లి మనసు తల్లడిల్లిపోయింది..

పాలిటిక్స్‌లో పవన్‌ కళ్యాణ్  కష్టపడుతుంటే తన మనసు తల్లడిల్లిపోయిందన్నారు అంజనాదేవి. 'షూటింగులు చేసి వచ్చి అలా సోఫాలోనే పడుకుని నిద్రపోయేవాడు. ఒక్కోసారి నేలమీద దిండు వేసుకుని పడుకునేవాడు.  గదిలోనే పడుకోవాలి.. మంచమే కావాలి అని ఎప్పుడూ అనుకోలేదు. ఏ విషయంలో అయినా.. చాలా కష్టపడతాడు. ఎంత కష్టపడినా ఇంత కష్టపడ్డాను అని ఏనాడు చెప్పుకోడు. అంతా తన మనసులోనే పెట్టుకుంటాడు. తిండి విషయంలో కూడా నాకు ఇది కావాలి అని ఏనాడు అడిగేవాడు కాదు. అన్నారు అంజనాదేవి. 

ఇక ఏది పెట్టినా తినేవాడు.. ఇది కావాలి అని ఎప్పుడు డిమాండ్ లేదు. కాని పులవ్ చేస్తే మాత్రం ఇంకాస్త ఎక్కువగా తినేవాడు. అంతే కాదు అది ఇది అని ఎప్పుడూ డిమాండ్ చేయలేదు.  బిడ్డ అంత కష్టపడుతున్నాడే అని నాకు మాత్రం బాధగా ఉండేది. చిన్నప్పటి నుంచి కూడా ఏమీ అడిగేవాడు కాదు. చిన్నప్పుడు కామ్ గా ఉండేవాడు. ఎక్కువ మాట్లాడేవాడు కాదు. భోజనానికి రమ్మని పిలిచినా వచ్చే వాడు కాదు. అంతా వచ్చిన తర్వాత లేట్ గా వచ్చేవాడు. ఇది కావాలి.. అది కావాలి అని అడిగేవాడు కాదు' అని ఆమె అన్నారు. 

ఇక పవన్ కళ్యాన్ లో ఉండే మరో మంచి గుణం 'పుస్తకాలు చదవడం. ఈ విషయంలో కూడా ఆమె ఇంట్రెస్టింగ్ విషయాన్ని పంచుకున్నారు. పవన్ కు  చదివే అలవాటు ఉండేది. స్కూలులో ఎక్కువ లేదు కాని 10వ తరగతికి వచ్చేసరికి వాళ్లన్నయ్య క్లాస్మేట్ కి బుక్ లైబ్రరీ ఉంటే.. అక్కడికి వెళ్లి ఎక్కువ చదువుకునేవాడు. ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగితే చదువుకోవడానికి అనేవాడు అంతే. 

అప్పటి నుంచే అలా  పవన్  కు పుస్తకాలు చదివే అలవాటు అబ్బింది. ఇప్పటికి కూడా చాలా పెద్ద పెద్ద పుస్తకాలు చదువుతుంటాడు.. ఇక తన ఇంట్లో కూడా పెద్ద పెద్ద పుస్తకాలు కనిపిస్తుంటాయట.  అయితే ఈ అలవాటు పవన్ కు వాళ్ల నాన్న గారి దగ్గర నుంచి వచ్చిందట. ఆయన కూడా రోజు  పుస్తకాలు చదివేవారు. వాళ్ల నాన్న అలవాట్లే వీళ్ళకు వచ్చాయి.  అన్ని పుస్తకాలు చదివాడు కాబట్టే.. అంత మంచి ఆలోచనలు వస్తున్నాయి. అందరికి మంచి  చేస్తున్నాడు అన్నారు అంజనాదేవి. 

Pawan Kalyan: Secrets Revealed by His Mother Anjanadevi JmS

చిరంజీవికి తమ్ముడంటే ప్రాణం..

ఇక పవన్ కు తన అన్న చిరంజీవి, వదిన సురేఖ అంటే ఎంతో ప్రేమ, గౌరవం. పవన్ ను చిన్నప్పుడు వాళ్ల పెద్ద అన్నయ్య చిరంజీవే బాగా దగ్గర తీసేవాడు. చిన్నవాడు కావడంతో చిరు బాగా గారాబంగా చూసుకునేవాడట. అంతే కాదు  వాళ్లన్నయ్య ఎత్తుకుని ఫోటోలు తీసుకోవడం లాంటివి చేసేవాడు. తమ్ముడిని చాలా బాగా చూసుకునేవాడు. నాగబాబుకు పవన్ అంటే ప్రేమ ఉన్నా.. చిరంజీవి అంతగా చూసుకునేవాడు కాదట. 

పవన్ ను  ఎక్కువ చేరదీసింది మాత్రం చిరంజీవినే. పవన్ కూడా అన్న చిరంజీవితోనే  ఎక్కువ ఉండేవాడు. ఇప్పటికీ వాళ్లన్నయ్య, వదినతోనే ఉంటాడు. మేము నెల్లూరులో ఉండేవాళ్లం. మాకు ఎక్కువగా ట్రాన్స్ ఫర్లు అయ్యేవి. పిల్లల చదువులు సరిగా ఉండవని కళ్యాణ్ బాబుని తీసుకువెళ్లి చదివిస్తాను అని చెప్పి.. చిరంజీవి మద్రాసు తీసుకువెళ్లిపోయాడు' అని చెప్పారు అంజనీదేవి. 

'మా అబ్బాయిపై వాళ్ల నాన్న గారి ప్రభావమే ఎక్కువగా ఉండేది. ఆయన కూడా కల్యాణ్‌ బాబులాగే  దానధర్మాలు చేసి ఎదుటివారికి సహాయం చేసే వారు. అదే గుణం పవన్‌కు  వచ్చింది. ముగ్గురికీ ఆ గుణం ఉంది. పవన్ కి కొంచం ఎక్కువ. సినిమాల్లో చేసేప్పుడు కూడా అందరికీ సాయం చేసేవాడు' అంటూ పవన్‌ వ్యక్తిత్వం గురించి తెలిపారు. నా బిడ్డ మరిన్ని ఉన్నత శిఖరాలను అందుకోవాలని కోరుకుంటున్నానని తల్లి మనసు చాటుకున్నారు అంజనా దేవి.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios