గత కొద్ది కాలంగా ..ప్రముఖ దర్శకుడు సురేంద్రరెడ్డి డైరక్షన్ లో యంగ్ హీరో అఖిల్ తో సినిమా తెరకెక్కబోతోందని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే అది భారీ బడ్జెట్ తో కూడుకున్నదని చెప్తున్నారు. ఏ ప్రొడ్యూసర్ కూడా ముప్పై నుంచి నలభై కోట్లు అఖిల్ మీద పెట్టడానికి సముఖంగా లేరు. దాంతో ఆ ప్రాజెక్టు ముందుకు వెళ్లటం లేదు. నాగ్ సైతం కొద్ది కాలం ఆగుదామన్నారట. అయితే ఆ స్క్రిప్టు మొదట పవన్ తో తెరకెక్కిద్దామనుకున్నారట సురేంద్రరెడ్డి.

ఐదారు నెలలు పాటు కూర్చుని ఓ స్పై థ్రిల్లర్ స్క్రిప్టుని రెడీ చేసిన సురేంద్రరెడ్డి ఆ కథని పవన్ కళ్యాణ్ కు వినిపించారట. అయితే పవన్ కు ఆ స్క్రిప్టు నచ్చినా...దేశ, విదేశాల్లో షూటింగ్ ఉంటుందని, అలాగే ఎక్కువ డేట్స్ అవసరం అవుతాయని భావించి, తను ఉన్న రాజకీయ పరిస్దితులతో డేట్స్ బాలెన్స్ చేయటం కష్టమని క్లియర్ గా చెప్పారట. అంతేకాదు ఎవరైనా యంగ్ హీరో తో అయితే మరింత బాగుటుందని సూచించారట. దాంతో అఖిల్ దగ్గరకు ఆ స్క్రిప్టు పట్టుకెళ్లారట. 

స్క్రిప్టు విన్న అఖిల్ కు ఆ స్టోరీ పిచ్చ పిచ్చగా నచ్చేసింది. అందులోనూ సురేంద్ర రెడ్డి వంటి టెక్నికల్ బ్రిలియన్స్ ఉన్న దర్శకుడు తెరకెక్కిస్తానంటే ఇంక చెప్పేదేముంది అనుకున్నారట. కాకపోతే ఆ బడ్జెట్ వర్కవుట్ కావటం లేదట. అలాగని తగ్గిస్తే క్వాలిటి ఉండదని సురేంద్రరెడ్డి భావించారట. ఈ లోగా పవన్ కోసం మరో కథ రాసి సురేంద్రరెడ్డి ఒప్పించారు. పవన్ తో సినిమా పూర్తి చేసే ఈ గ్యాప్ లో అఖిల్ కోసం  నిర్మాతను వెతుకుదామని చెప్పారట. అన్నీ కుదిరితే ఆ స్పై థ్రిల్లర్ ని అఖిల్ చేయబోతాడన్నమాట. అదీ సంగతి.