పవన్‌ కళ్యాణ్‌ పారితోషికం పెంచాడు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న సినిమాల పారితోషికం వివరాలు తెలిస్తే మైండ్‌ బ్లాక్‌ అవ్వాల్సిందే. ఇది ప్రభాస్‌ని మించిన రెమ్యూనరేషన్‌ కావడం గమనార్హం.

ప్రస్తుతం టాలీవుడ్‌ చిత్ర పరిశ్రమలోనే కాదు, ఇండియన్‌ సినిమా ఇండస్ట్రీలోనే అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరోగా ప్రభాస్‌ నిలిచారు. పాన్‌ ఇండియా స్టార్‌ ఇమేజ్‌ని దాటుకుని గ్లోబల్‌ స్టార్‌ ఇమేజ్‌ వైపు అడుగులు వేస్తున్నారు. ఆయన ఒక్కో సినిమాకి 120 కోట్ల నుంచి 150 కోట్ల వరకు పారితోషికం అందుకుంటున్నారని సమాచారం. `ఆదిపురుష్‌`, `సలార్‌`, `ప్రాజెక్ట్ కే` చిత్రాలకుగానూ ప్రభాస్‌ ఈ రేంజ్‌లో రెమ్యూనరేషన్‌ తీసుకుంటున్నారని ప్రచారం జరుగుతుంది. 

ఇదిలా ఉంటే ఇప్పుడు ప్రభాస్‌ని మించబోతున్నారు పవన్‌. ఆయన ప్రభాస్‌ని మించిన రెమ్యూరేషన్‌ తీసుకోబోతున్నారనే వార్త ఇప్పుడు సోషల్‌ మీడియాలో రచ్చ చేస్తుంది. ప్రస్తుతం పవన్‌ నాలుగు సినిమాల్లో నటిస్తున్నారు. అందులో రెండు చిత్రీకరణ దశలో ఉన్నారు. `హరిహర వీరమల్లు` షూటింగ్‌ జరుపుకుంటోంది. చివరి దశకు చేరుకుంది. దీంతోపాటు `వినోదయ సీతం` ఇటీవలే ప్రారంభమైంది. రెగ్యూలర్‌ షూట్‌ని జరుపుకుంటోంది. సాయిధరమ్‌ తేజ్‌, పవన్‌ మధ్య సీన్లు షూట్‌ చేస్తున్నారని సమాచారం. 

మరోవైపు వచ్చే నెలలో హరీష్‌ శంకర్‌తో చేయబోయే `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌` సినిమా స్టార్ట్ కానుంది. ఏప్రిల్‌లో సుజీత్‌ `ఓజీ`ని ప్రారంభించనున్నారు. ఈ మూడు సినిమాలను మూడు నెలల్లో కంప్లీట్‌ చేసే ఆలోచనలో ఉన్నారు పవన్‌. `వినోదయ సీతం` చిత్రానికి 20-25రోజులు, `ఉస్తాద్ భగత్‌ సింగ్‌`కి 35 రోజులు, `ఓజీ`కి 30 రోజులు డేట్స్ కేటాయించారట పవర్‌ స్టార్‌. ఇలా ఎటూ చూసినా తన పాత్రకి సంబంధించిన షూట్‌.. నెల, నెల పది రోజుల్లో ఒక్కో సినిమా కంప్లీట్‌ కానుంది. మధ్య మధ్యలో `హరిహర వీరమల్లు`కి, అటు రాజకీయాలకు టైమ్‌ ఇవ్వబోతున్నారు పవన్‌. 

ఇదిలా ఉంటే ఇప్పుడు పవన్‌ పారితోషికం హాట్‌ టాపిక్‌గా మారింది. ఇప్పటి వరకు పవన్‌ ఒక్కోసినిమాకి రూ.50కోట్లు తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. కానీ ఇప్పుడు పారితోషికం పెంచారట. ఒక్కో సినిమాకి 75కోట్లు తీసుకుంటున్నట్టు సమాచారం. `వినోదయ సీతం` సినిమాకి రూ.75కోట్లు పారితోషికం కోట్‌ చేశారట పవన్‌. ఆ నిర్మాణ సంస్థ `పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ` అందుకు ఓకే చెప్పిందని టాక్‌. ఈ లెక్కన పవన్‌ పారితోషికం రోజుకి రెండున్నర నుంచి మూడు కోట్ల వరకు అందుకుంటున్నట్టు చెప్పొచ్చు. ఇలా అత్యంత కాస్ట్లీ యాక్టర్‌గా నిలుస్తున్నారు పవన్‌. 

మరోవైపు `ఓజీ` సినిమాకి పవన్‌ పారితోషికం తెలిస్తే మాత్రం ఫ్యూజులెగిరిపోవాల్సిందే. ఈ చిత్రానికి ఆయన రూ.150 నుంచి 160కోట్లు అందుకోబోతున్నారట. అంటే.. ఈ సినిమాని రెండు పార్ట్ లుగా తీసుకురాబోతున్నారట దర్శకుడు సుజీత్‌. ఒక్కో పార్ట్ కి రూ.80కోట్లు ఇస్తున్నారట. ఈ లెక్కన రెండు పార్ట్ లకు పవన్‌కి సుమారు 160కోట్లు ముట్టనుంది. ఇది ప్రభాస్‌ కంటే ఎక్కువే. పైగా ఈ సినిమాకి పవన్‌ ఇచ్చిన డేట్స్ 30 రోజులే. అంటే రోజుకి రెండున్నర కోట్లకుపైగానే అందుతుందనే వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. ఇది నిజమా, లేదా కేవలం పుకారా? అనేది పక్కన పెడితే ఈ వార్త తెలిసి సినీ వర్గాలు షాక్‌ కి గురవుతుండగా, అది మా పవర్‌ స్టార్‌ రేంజ్‌ అని అభిమానులు సంబరపడుతున్నారు.