జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనంతపురం సభ విజయవంతం కావడం కోసమే రామ్ చరణ్ ధృవ ఆడియో ఫంక్షన్ రద్దు చేసారట. రాజకీయ పార్టీగా పవర్ స్టార్ జనసేన తనదైన శైలిలో జనంలోకి దూసుకెళ్తోంది. విశేష ప్రజాదరణ పొందుతూ పవన్ కళ్యాణ్ సభలన్నీ భారీగా విజయవంతమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే... పవన్ కళ్యాణ్ అనంతపురంలో సభ నిర్వహించారు. అనంత నుంచే తన పార్టీ కార్యాలయాన్ని ముందుగా ప్రారంభిస్తానని ప్రకటించారు పవన్. సభ విజయవంతమైంది. పక్కా పొలిటికల్ పంచ్ లతో పవన్ అదరగొట్టారు. క్రిటిక్స్ కూడా అభినందించారు. అయితే ఈ సభ ఇంతలా సక్సెస్ కావడం వెనుక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పాత్ర కూడా కీలకమైందని మెగా అభిమానులు చెప్తున్నారు.

దీనికి కారణమేంటంటే మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌ , ర‌కుల్ ప్రీత్ సింగ్ జంట‌గా ప్ర‌తిష్టాత్మ‌క‌మైన గీతాఆర్ట్స్ బ్యాన‌ర్ లో, స్టైలిష్ డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న స్ట‌యిలిష్ ఎంట‌ర్‌టైన‌ర్ `ధృవ`లో నటిస్తున్నారు. హిప్ హాప్ ఆది సంగీతం అందించిన ఈ సినిమా పాట‌లు ఎలాంటి ఆర్భాటం లేకుండా నేరుగా మార్కెట్లోకి విడుద‌లయ్యాయి. నిజానికి నవంబర్ 9న భారీ ఎత్తున ఫంక్షన్ నిర్వహించి ఆడియో విడుదల చేయాలనుకున్నా... అదే సమయానికి ఒక్క రోజు తేడాతో... పవన్ కళ్యాణ్ అనంతపురంలో జనసేన సభ నిర్వహించడంతో అభిమానులకు రెండు ఈవెంట్లతో బోర్ కొట్టకుండా, ఇబ్బంది కలగకుండా ప్లాన్ చేశారట. బాబాయి పవన్ కళ్యాణ్ తో మాట్లాడాకే.. అబ్బాయి రామ్ చరణ్ ధృవ ఆడియో వేడుక రద్దు నిర్ణయం తీసుకున్నారని మెగా ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు. ఈ మేరకు మెగా అభిమానులకు ఆదేశాలు కూడా వెళ్లాయట.

ఆడియో వేడుక ఘనంగా నిర్వహిస్తే...మెగా అభిమానులు హైదరాబాద్ నుంచి ఒక్క రోజు గ్యాప్ తీసుకుని అనంతపురం వెళ్లడం ఇబ్బందికరంగా మారి జనం తగ్గుతారని అంచనా వేశారట. దీంతో రాజకీయ సభ గ్రాండ్ సక్సెస్ కావాలంటే అభిమానులు అనంతకు వచ్చేలా పరిస్థితులు ఉండాలంటే... ధృవ ఆడియో రద్దు నిర్ణయమే కరెక్టని డిసైడ్ అయ్యారట. సో మొత్తంమీద బాబాయి అబ్బాయిల మధ్య ఉన్న కో ఆపరేషన్ చూసి మెగా అభిమానులు మాత్రం సంబుర పడిపోతున్నారు.