పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాలన్నీ తాత్కాలికంగా ఆగిపోయినట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ అటు సినిమాలతో, ఇటు రాజకీయాలతో బిజీగా ఉన్నారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాలన్నీ తాత్కాలికంగా ఆగిపోయినట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ అటు సినిమాలతో, ఇటు రాజకీయాలతో బిజీగా ఉన్నారు. కానీ జనసేన పార్టీని బలోపేతం చేయడంపైనే ప్రస్తుతం పవన్ ద్రుష్టి మొత్తం ఉంది. ఈ క్రమంలో ఆహ్వానం కళ్యాణ్ నటిస్తున్న సినిమాలపై సందిగ్దత నెలకొంది.
భారీ బడ్జెట్ లో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు చిత్రం చాలా కాలంగా షూటింగ్ నిలిచిపోయింది. ఆ ప్రాజెక్ట్ అటకెక్కిందనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. అలాగే హరీష్ శంకర్ దర్శకత్వంలో 'భవదీయుడు భగత్ సింగ్' చిత్రాన్ని ప్రకటించారు. ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా జరిగాయి. ఆ మూవీ కూడా ఇప్పట్లో పట్టాలెక్కేలా కనిపించడం లేదు. దీనితో హరీష్ శంకర్ తన తదుపరి చిత్రాలపై ఫోకస్ పెట్టాడు.
మరోవైపు ఇటీవల పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రల్లో 'వినోదయ సిత్తం' రీమేక్ సీక్రెట్ గా ప్రారంభం అయినట్లు తెలుస్తోంది. జూలై లోనే రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లాల్సి ఉంది. కానీ తాజాగా పవన్ ఆ చిత్రాన్ని కూడా టెంపరరీగా ఆపేసినట్లు వార్తలు వస్తున్నాయి. 'వినోదయ సిత్తం' రీమేక్ ఫ్యాన్స్ కి కూడా అంతగా నచ్చడం లేదు. ఆ చిత్రం ఆగిపోతే మొదట సంతోషించేది పవన్ అభిమానులే.
కానీ హరిహర వీరమల్లు, భవదీయుడు భగత్ సింగ్ చిత్రాల విషయంలోనే ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో ఉన్నారు. ఎన్నికలకు ఇక రెండేళ్లు మాత్రమే సమయం ఉంది. అలాంటప్పుడు పవన్ రాజకీయ కార్యక్రమాలు చూసుకుంటూ ఈ మూడు చిత్రాలు ఫినిష్ చేయడం దాదాపు అసాధ్యం అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.
