వరస పెట్టి వచ్చిన ప్లాఫ్ ల తర్వాత మెగా మేనల్లుడు సాయి తేజ చిత్రలహరి చిత్రంతో రీజనబుల్ హిట్ ని కొట్టాడు. మైత్రీ మూవీస్ నిర్మించిన ఈ చిత్రం పెద్ద హిట్ కాకపోయినా సాయికి  కాస్త ఊపిరిపీల్చుకునే అవకాసం ఇచ్చింది. దాంతో మారుతి తో చేయబోయే చిత్రానికి ఉత్సాహంగా సిక్స్ ప్యాక్ తో  ప్రిపేర్ అవుతున్నాడు సాయి. ఈ నేపధ్యంలో తన మేనల్లుడు మరింత ఉత్సాహాన్ని ఇవ్వటానికి పవన్ పూనుకున్నారు. ఆయన సాయితో ఓ చిత్రం నిర్మించబోతున్నట్లు సమాచారం.

తన పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై సాయితో ఓ చిత్రం ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. పవన్ క్లోజ్ అసోశియేట్స్ లో ఒకరు దీన్ని డైరక్ట్ చేయనున్నారు. ఇంతకు ముందు నితిన్ హీరోగా ఛల్ మోహన్ రంగా అనే చిత్రాన్ని నిర్మించారు ఇదే బ్యానర్ . ఆ తర్వాత చేస్తున్న చిత్రం ఇదే. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం రూపొందనుందని సమాచారం.

అలాగే ఈ చిత్రం కోసం ప్రత్యేకమైన యాక్షన్ సీక్వెన్స్ లు రూపొందించాలని ఆలోచనలో ఉన్నట్లు చెప్తున్నారు. సాయిని డిఫరెంట్ ప్రెజెంట్ చూసి యూత్ లోకు పంపాలనేది పవన్ ఆలోచన అంటున్నారు. ఈ సినిమా కోసం అవసరమనుకుంటే కొద్ది రోజులు యాక్షన్ ఎపిసోడ్స్ కు చెందిన ట్రెనింగ్ ఇప్పించాలన్నట్లు వినికిడి.