విజయవాడ సభలో పవన్ కళ్యాణ్ ఆవేశంతో ఊగిపోయారు. బూతులతో రెచ్చిపోయారు. వైసీపీ నేతలను విమర్శించే క్రమంలో సహనం కోల్పోయాడు. మాటల్లో మాటగా విడాకులు ఇచ్చిన ఇద్దరు భార్యలకు ఎంతెంత భరణం ఇచ్చాడో చెప్పుకొచ్చాడు.
వైజాగ్ జనవాణి సభ అనుకున్న ప్రకారం జరగలేదు. దీంతో నిన్న పవన్ కళ్యాణ్ విజయవాడ వచ్చారు. నేడు విజయవాడ వేదికగా మీడియా, కార్యకర్తలతో మాట్లాడారు. ఈ సందర్భంగా పవన్ సంచలన కామెంట్స్ చేశాడు. వైసీపీ నేతలను ఒక రేంజ్ లో తిట్టిపోశాడు. వెధవలు సన్నాసులు, దద్దమ్మలు అంటూ నోటికి పని చెప్పాడు. మరోసారి ప్యాకేజీ అంటే చెప్పుతో కొడతా అంటూ కాలికి ఉన్న చెప్పు తీసి చూపించాడు. నాకొడకల్లారా అటు వైపు ఇటు వైపు చెప్పుతో కొడతా అని తీవ్ర స్థాయిలో ఊగిపోయాడు.
అలాగే మూడు పెళ్లిళ్లు చేసుకున్నానని విమర్శిస్తే ఊరుకునేది లేదన్నాడు. కావాలంటే మీరు కూడా మూడు పెళ్లిళ్లు చేసుకోండి. నేను విడాకులు ఇచ్చి మూడు పెళ్లిళ్లు చేసుకున్నాను. మొదటి భార్యకు రూ. 5 కోట్ల డబ్బులు ఇచ్చాను. రెండో భార్యకు మిగిలిన ఆస్తి ఇచ్చాను. వారిద్దరితో నాకు వర్క్ అవుట్ కాలేదు. విడాకులు ఇచ్చి మూడో పెళ్లి చేసుకున్నాను. ఒక్క పెళ్లి చేసుకొని 30 స్టెప్నిలతో కనెక్షన్స్ పెట్టుకునే మీరా విమర్శించేదని అన్నారు.
ఇక్కడ పవన్ మొదటి భార్య నందికి రూ. 5 కోట్ల రూపాయలు విడాకుల భరణంగా ఇచ్చినట్లు చెప్పారు. అలాగే రేణు దేశాయ్ కి ఆస్తి ఇచ్చాను అన్నారు. నందినికి ఆయన ఐదు కోట్లు ఇచ్చారో లేదో తెలియదు కానీ రేణూ దేశాయ్ మాత్రం తనకు పవన్ ఒక్క రూపాయి ఇవ్వలేదని పలు సందర్భాల్లో వెల్లడించారు. నా స్వశక్తితో పిల్లల పోషణ, చదువు బాధ్యతలు నెరవేరుస్తున్నాను అన్నారు. పవన్ కళ్యాణ్ భారీ మొత్తంలో భరణం ఇచ్చాడన్న వార్తల్లో నిజం లేదని రేణు కొట్టిపారేశారు. పవన్ మాత్రం రేణుకు తన మిగిలిన ఆస్తి ఇచ్చినట్లు చెప్పుకొస్తున్నారు.
పవన్ కళ్యాణ్ 1997లో వైజాగ్ కి చెందిన నందిని అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు. 2007లో అధికారికంగా విడాకులు ఇచ్చి విడిపోయారు. అనంతరం 2009లో రేణూ దేశాయ్ ని వివాహం చేసుకున్నారు. 2012లో రేణు దేశాయ్ కి విడాకులు ఇచ్చారు. రేణు దేశాయ్ కి ఒక అబ్బాయి, అమ్మాయి సంతానంగా ఉన్నారు. 2013లో అన్నా లెజినోవా మెడలో తాళికట్టాడు.
