Asianet News TeluguAsianet News Telugu

`ఓజీ` టీజర్‌ వచ్చేది అప్పుడే.. షూటింగ్‌ అప్‌డేట్‌ ఇచ్చిన ప్రొడ్యూసర్‌.. పవన్‌ ఫ్యాన్స్ కి ఈ మాత్రం హింట్‌ చాలు

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ `ఓజీ` సినిమాపై అదిరిపోయే అప్‌ డేట్‌ ఇచ్చాడు నిర్మాత దానయ్య. టీజర్‌ రిలీజ్‌ చేయబోతున్నట్టు చెప్పి సర్‌ప్రైజ్‌ చేశారు. 
 

pawan kalyan OG teaser date ad shooting update by producerdvv danayya arj
Author
First Published Aug 21, 2024, 5:15 PM IST | Last Updated Aug 21, 2024, 5:15 PM IST

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ నటించాల్సిన సినిమాల్లో `ఓజీ` ఒకటి. ప్రస్తుతం ఆయన చేయాల్సిన మూడు సినిమాలు షూటింగ్‌ దశలో ఉన్నాయి. `హరిహర వీరమల్లు`, `ఓజీ`, `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌` సినిమాలు చేయాల్సింది. ఇప్పటికే కొంత వరకు షూటింగ్‌లు పూర్తి చేసుకున్నాయి. ఏపీలో ఎన్నికలు రావడంతో పవన్‌ కళ్యాణ్‌ ఆ బిజీలో పడి సినిమాలను పక్కన పెట్టారు. ఎన్నికలు అయిపోయాయి. అధికారం వచ్చింది. పవన్‌ ఏపీ డిప్యూటీ సీఎంగా పదవి స్వీకరించి మంత్రిగా బిజీగా ఉన్నారు. 

అయితే రెండు మూడు నెలల తర్వాత టైమ్‌ దొరికిన దాన్ని బట్టి సినిమాలు చేస్తానని తెలిపారు పవన్‌. వారంలో రెండు మూడు రోజులు షూటింగ్‌లో పాల్గొనేలా చూసుకుంటానని తెలిపారు. ఈ క్రమంలో ఇప్పుడు ఆయన షూటింగ్‌లో పాల్గొనేందుకు రెడీ అవుతున్నారు. అందులో భాగంగా ఇప్పటికే `హరి హరవీరమల్లు` సినిమా షూటింగ్‌ జరుగుతుంది. పవన్‌ లేని సీన్లని షూట్‌ చేస్తున్నారట. త్వరలోనే ఈ మూవీ షూటింగ్‌లో పవన్‌ పాల్గొంటాడని తెలుస్తుంది. మరోవైపు త్వరలోనే `ఓజీ`ని ప్రారంభించబోతున్నారు. ఈ విషయాన్ని నిర్మాత డివివి దానయ్య తెలిపారు. 

దానయ్య ప్రస్తుతం నానితో `సరిపోదా శనివారం` సినిమా చేశారు. ఈ నెల 29న ఇది విడుదల కానుంది. ఈ నేపథ్యంలో బుధవారం మీడియాతో ఇంటరాక్షన్‌ ఏర్పాటు చేశారు. ఇందులో `ఓజీ` అప్‌ డేట్‌ అడిగాడు నాని. దీనికి నిర్మాత దానయ్య స్పందిస్తూ, అతి తొందర్లోనే సినిమా మీ ముందుకు వస్తుందని, త్వరలోనే సినిమా షూటింగ్‌ స్టార్ట్ అవుతుందని చెప్పారు దానయ్య. సినిమా అదిరిపోయేలా ఉంటుందని వెల్లడించారు. తన కాన్ఫిడెన్స్ ని బయటపెట్టారు నిర్మాత. 

మరోవైపు త్వరలోనే పవన్‌ కళ్యాణ్‌ బర్త్ డే ఉండబోతుంది. సెప్టెంబర్‌ 2న ఆయన పుట్టిన రోజు అనే విషయం తెలిసిందే. ఆ రోజు టీజర్‌ ఏమైనా వచ్చే అవకాశం ఉందా? అని నిర్మాతని అడగ్గా, ఉంటుందని నిర్మాత దానయ్య చెప్పడం విశేషం. దీంతో పవన్‌ ఫ్యాన్స్ కి కావాల్సిన అప్‌ డేట్‌ వచ్చింది. అదే సమయంలో గూస్‌ బంమ్స్ తెప్పించే అప్‌ డేట్‌ ఇచ్చారు. పవన్‌ బర్త్ రోజు `ఓజీ` రచ్చ వేరే లెవల్‌లో ఉండబోతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 

అయితే పవన్‌ ముందు ఏ సినిమా షూటింగ్‌లో పాల్గొంటాడనేది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశం అవుతుంది. ఇప్పటికే `హరిహరవీరమల్లు` సినిమా షూటింగ్ జరుగుతుంది. పవన్‌ త్వరలోనే షూటింగ్‌లో పాల్గొంటాడని తెలుస్తుంది. ఇది చాలా పెద్ద స్కేల్‌ ఉన్న మూవీ. చాలా రోజుల కాల్షీట్లు అవసరం అవుతాయి. పవన్‌ ఎలా సర్దుబాటు చేస్తాడనేది ఓ ప్రశ్న. అయితే ఇది ఎప్పుడు పూర్తవుతుంది. `ఓజీ` షూటింగ్‌లో ఎప్పుడు పాల్గొంటాడనేది పెద్ద మిస్టరీగా మారింది. ఫ్యాన్స్ కి కిక్కిచ్చే విషయం చెప్పినా ప్రాక్టికల్‌గా అది ఎలా సాధ్యమనేది ఇప్పుడు అందరిని ఆలోచింప చేస్తున్న విషయం. ఏం జరుగుతుందనేది వేచి చూడాలి. 

`ఓజీ` సినిమాకి సుజీత్‌ దర్శకత్వం వహించగా, పవన్‌కి జోడిగా ప్రియాంక మోహన్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. బాలీవుడ్‌ నటుడు ఇమ్రాన్‌ హష్మి విలన్‌ రోల్ చేస్తున్నారు. డీవీవీ ఎంటర్టైన్‌మెంట్స్ పతాకంపై దానయ్య నిర్మిస్తున్నారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios