తెలుగు సినిమా బిజినెస్ కు ఓవర్ సీస్ లో మార్కెట్ బాగా పెరుగుతోంది. క్రమక్రమంగా మన చిత్రాలకు డిమాండ్ ఎక్కవవుతోంది.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఆయన వరస పెట్టి రీమేక్ లు చేస్తూండటంతో ఆయనకు క్రేజ్ తగ్గలేదు కానీ ఓ వర్గంలో ఆయన సినిమాలంటే ఉత్సాహం తగ్గిది. అయితే ఆయన ఇది గమనించినట్లున్నారు. ఓజీ అనే స్ట్రెయిట్ చిత్రం చేస్తున్నారు. ఈ సినిమా ప్రారంభం నుంచి అభిమానుల్లో కాదు టాలీవుడ్ లో ఉన్న క్రేజ్ రోజు రోజుకీ పెరిగిపోతోంది. ఈ ప్రాజెక్టుని, పవన్ నమ్మి నిర్మాతలు ఎంత బడ్జెట్ అయినా పెట్టడానికి రెడీ అయ్యారు. అదే లెక్కలో బిజినెస్ కూడా జరుగుతున్నట్లు ట్రేడ్ వర్గాల సమాచారం.
అందుతున్న సమాచారం మేరకు ....₹18 కోట్లకి #OG ఓవర్సీస్ రైట్స్ వెళ్లినట్లు తెలుస్తోంది. ఓవర్ సీస్ లో ఇది మామూలు రేటు కాదు. ఇంతకు ముందు పవన్ చేసిన భీమ్లా నాయక్ కి డబుల్ రేట్ కావంట విశేషం. ఇక్కడ చెప్పుకోదగ్గ మరో విషయం ఏమిటంటే..ఈ సినిమాకు ఫస్ట్ లుక్ అయినా రిలీజ్ అవలేదు, సినిమా రిలీజ్ ఎప్పుడో కూడా తెలీదు. అయినా రికార్డ్ రేటు పలకటమే. ఏదైమైనా పవన్ కళ్యాణ్ స్ట్రెయిట్ సినిమా చేస్తే ఇది రేంజ్ అని ఫ్యాన్స్ మురిసిపోతున్నారు.
మరో ప్రక్క పవన్ డిమాండ్ చేసినంత రెమ్యునరేషన్ కూడా నిర్మాత ఇవ్వడానికి వెనుకాడలేదని సమాచారం. పవన్ చేస్తున్న ఓజీ మూవీ కోసం కూడా అతనికి భారీ రెమ్యునరేషన్ ఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా కోసం తన కెరీర్లోనే తొలిసారి పవన్ కల్యాణ్ రూ.100 కోట్లు వసూలు చేస్తున్నాడట. దీంతో ఇండియాలో రూ.100 కోట్లకుపైగా రెమ్యునరేషన్ అందుకుంటున్న హీరోల లిస్టులో పవర్ స్టార్ చేరిపోయాడు. సాహో ఫేమ్ సుజీత్ డైరెక్షన్ లో ఈ ఓజీ మూవీ వస్తోంది. ఈ సినిమాను ఈ ఏడాది డిసెంబర్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
