పవన్‌ని ఇప్పటి వరకు ఒకలా చూశారు. ఇకపై మరోలా చూడబోతున్నారు. అందుకు సాక్ష్యమే తాజాగా విడుదలైన పోస్టర్‌. ప్రస్తుతం అది సోషల్‌ మీడియాని ఊపేస్తుంది.  

మ్యూజిక్‌ డైరెక్టర్‌ థమన్‌ అప్పుడప్పుడు తాను వర్క్ చేసే సినిమాల అప్‌డేట్లు ఇస్తూ ఫ్యాన్స్ ని ఖుషి చేస్తుంటాడు. సడెన్‌ సర్‌ప్రైజ్‌లిస్తుంటారు. కొన్ని సార్లు లీక్‌ చేస్తుంటాడు. తాజాగా ఆయన ఓ గూస్‌ బంమ్స్ తెప్పించే పోస్టర్‌ విడుదల చేశారు. అది పవన్‌ కళ్యాణ్‌ నటిస్తున్న `ఓజీ` నుంచి కావడం విశేషం. ఇదే ఇప్పుడు దుమారం రేపుతుంది. ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పిస్తుంది. 

ఇందులో పవన్‌ కళ్యాణ్‌ ముంబయి వీధుల్లో కత్తి పట్టి ప్రత్యర్థులను తెగనరుకుతున్నాడు. ఆయనపై అంతా రక్తపు మరకలే. కత్తి ఎత్తి ఆవేశంతో విలన్లని తుదముట్టిస్తున్నట్టుగా పవన్ లుక్‌ ఉంది. ఇందులో ఆయన వైట్‌ షర్ట్ ధరించారు. టక్‌ వేసుకున్నాడు. వైట్‌ షర్ట్ మొత్తం రక్త మరకలతో ముద్దైపోయింది. ఇందులో పవన్‌ లుక్‌ చాలా పవర్‌ ఫుల్‌గా ఉంది. ఈ ఒక్క లుక్కే సినిమా ఎలా ఉండబోతుందో తెలియజేస్తుంది. అభిమానులకే కాదు, సాధారణ ఆడియెన్స్ కి కూడా గూస్‌ బంమ్స్ తెప్పిస్తుంది. అయితే సడెన్‌గా ఆయన ఇలా పోస్ట్ చేయడమే ఆశ్చర్యపరుస్తుంది. 

ఇక సుజీత్‌ దర్శకత్వంలో `ఓజీ` మూవీ రూపొందుతుంది. ఇందులో పవన్‌ ముంబయి మాఫియా డాన్‌ తరహా పాత్రలో కనిపించబోతున్నారట. దీనికి సంబంధించి విడుదలైన గ్లింప్స్ మతిపోయేలా ఉంది. సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది.సినిమా అదే రేంజ్‌లో ఉంటే రికార్డులన్నీ షేక్‌ కావడం ఖాయమంటున్నారు. అందులో నటించే నటీనటులు కూడా అలాంటి కామెంట్లే చేస్తున్నారు. శ్రియా రెడ్డి ఓ రేంజ్‌లో చెప్పింది. సలార్‌ని మించి ఉండబోతుందని వెల్లడించిన విషయం తెలిసిందే. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి. 

Scroll to load tweet…

సుజీత్‌ దర్శకత్వం వహిస్తున్న `ఓజీ`లో పవన్‌కి జోడీగా ప్రియాంక అరుల్‌ మోహన్‌ నటిస్తుంది. శ్రియా రెడ్డి, బాలీవుడ్‌ నటుడు ఇమ్రాన్‌ హష్మీ, అర్జున్‌ దాస్‌ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ మూవీని సెప్టెంబర్‌ 27న విడుదల చేయబోతున్నారు. పాన్‌ ఇండియా స్కేల్‌లో దీన్ని ప్లాన్‌ చేస్తున్నారు.ఇప్పటి వరకు దాదాపు 70శాతం షూటింగ్‌ అయిపోయిందట. మరో 15రోజులు పవన్‌ డేట్స్ ఇస్తే సినిమా కంప్లీట్‌ అవుతుందంటున్నారు. ఏపీ ఎన్నికల తర్వాత ఈ మూవీ షూటింగ్‌లో పాల్గొనే అవకాశం ఉంది. దీనికి థమన్‌ సంగీతం అందిస్తున్నారు. 

Read more: బాలకృష్ణ ఇప్పటి వరకు ఎన్ని రీమేక్‌ చిత్రాల్లో నటించాడో తెలుసా?.. సీనియర్స్ లో ఆయన ప్లేస్‌ ఎక్కడంటే?