పవన్‌ గ్యాప్‌ లేకుండా `హరిహర వీరమల్లు` చిత్ర షూటింగ్‌లో పాల్గొంటున్నారని సమాచారం. అయితే తాజాగా ఇందులోని పవన్‌ లుక్‌ లీక్‌ అయ్యింది.

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ రాజకీయాల నుంచి గ్యాప్‌ తీసుకుని `హరిహర వీరమల్లు` చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతుంది. క్రిష్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్ర షూటింగ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది. గ్యాప్‌ లేకుండా లాంగ్‌ షెడ్యూల్‌ని ప్లాన్‌ చేశారు. పవన్‌ ఇందులో అంతే నిబద్దతతో షూటింగ్‌లో పాల్గొనబోతున్నారట. త్వరగా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేయాలని భావిస్తున్నారట. 

ఈ నేపథ్యంలో ఆయన గ్యాప్‌ లేకుండా షూటింగ్‌లో పాల్గొంటున్నారని సమాచారం. అయితే తాజాగా ఇందులోని పవన్‌ లుక్‌ లీక్‌ అయ్యింది. `హరిహర వీరమల్లు` చిత్రంలోని ఆయన నయా గెటప్‌తో కూడిన ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఇందులో ఓ లేడీ టెక్నీషియన్‌ షూటింగ్‌ సెట్‌లో పవన్‌ కళ్యాణ్‌తో ఫోటో దిగింది. వాటిని సోషల్‌ మీడియా వేదికగా పంచుకుంది. 

దీంతో పవన్‌ `హరిహర వీరమల్లు` లుక్‌ నెట్టింట హల్‌చల్‌ చేస్తుంది. ఇందులో గెడ్డంతో పవర్‌ఫుల్‌ లుక్‌లో కనిపిస్తున్నారు పవన్‌. నుదుటిపై గాయం కనిపిస్తుంది. రెడ్‌ డ్రెస్‌ వేశాడు. యుద్ధంలో పాల్గొనే యోధుడిలా ముస్తాబై ఉన్నాడు పవన్‌. ఆయన `హరి హర వీరమల్లు` చిత్రంలోని గెటప్‌ ఆద్యంతం కట్టిపడేస్తుంది. అభిమానులకు పూనకాలు తెప్పిస్తుంది. గతంలో విడుదల చేసిన `హరి హర వీరమల్లు` ఫస్ట్ గ్లింప్స్ లో కనిపించాడు పవన్‌. అందులోనూ ఇలాంటి గెటప్‌లోనే ఉన్నాడు. కానీ ఇది మాత్రం అంతకు మించి అనేలా ఉంది.

Scroll to load tweet…

ఇప్పుడు పవన్‌ అభిమానులకు ఫుల్‌ జోష్‌నిస్తుంది. ప్రస్తుతం ఇది సోషల్‌ మీడియాలో ట్రెండ్ అవుతుంది. మరి సినిమాలో ఆయన పాత్ర ఏ రేంజ్‌లో ఉటుందో అర్థం చేసుకోవచ్చు. పవన్‌కి జోడీగా నిధి అగర్వాల్‌ నటిస్తున్న ఈ చిత్రాన్ని ఏ ఎం రత్నం నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పాన్‌ ఇండియా లెవల్‌లో విడుదల చేయబోతున్నారు. ఇందులో పవన్‌ వీరమల్లు అనే బందిపోటు పాత్రలో కనిపించనున్నట్టు సమాచారం.