పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ ని పదింతలు పెంచుతూ అభిమానులు గుండెల్లో నాటుకుపోయేలా చేసిన చిత్రం ఖుషి. ఈ చిత్రంతో పవన్ కళ్యాణ్ కి కల్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ ని పదింతలు పెంచుతూ అభిమానులు గుండెల్లో నాటుకుపోయేలా చేసిన చిత్రం ఖుషి. ఈ చిత్రంతో పవన్ కళ్యాణ్ కి కల్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఖుషి వేసిన పునాదితో ఆ తర్వాత పదేళ్ల పాటు పవన్ కళ్యాణ్ కి హిట్ లేకపోయినా క్రేజ్ చెక్కు చెదరలేదు.
ఇప్పుడు మరోసారి పవన్ అభిమానులు ఖుషి చిత్రంతో పండగ చేసుకోబోతున్నారు. కొన్ని నెలల క్రితం పవన్ పుట్టిన రోజు సందర్భంగా జల్సా చిత్రాన్ని 4కె ప్రింట్ లో రీరిలీజ్ చేయగా ఆల్ టైం రికార్డులు నెలలకొల్పింది. జల్సా చిత్రం రీరిలీజ్ లో ఏకంగా 4 కోట్ల వసూళ్లు రాబట్టింది. రీరిలీజ్ లో మరే స్టార్ హీరో చిత్రం ఈ ఫీట్ అందుకోలేదు. పవన్ కళ్యాణ్ క్రేజ్ కి ఇదే నిదర్శనం.
ఇక ఇప్పుడు ఖుషి చిత్రంతో రీరిలీజ్ లో సరికొత్త రికార్డులు క్రియేట్ చేసేందుకు పవన్ ఫ్యాన్స్ రెడీ అవుతున్నారు. న్యూ ఇయర్ సందర్భంగా ఖుషి చిత్రాన్ని 4కె ప్రింట్ లో రీరిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్క్రీన్స్ లో ఈ చిత్రాన్ని రి రిలీజ్ చేస్తున్నారు. అడ్వాన్స్ బుకింగ్స్ లో టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి.
అడ్వాన్స్ బుకింగ్స్ లో జల్సా చిత్రాన్ని ఖుషి నైజాం ఏరియాలో అధికమించింది. జల్సా 1. 25 కోట్లు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా రాబట్టగా.. ఖుషి చిత్రం 1.30 కోట్లు రాబట్టింది. అన్ని షోలు ముగిసే సమయానికి జల్సా రికార్డులని ఖుషి అధికమిస్తుంది అని ట్రేడ్ అంచనా వేస్తున్నారు.
ఇప్పటికే పవన్ అభిమానులు సోషల్ మీడియాలో మాస్ జాతర షురూ చేశారు. ఖుషి చిత్రంతో పవన్ స్టామినా మరోసారి రుజువైంది అని అంటున్నారు. ఇతర స్టార్ హీరోల చిత్రాలేవీ రీరిలీజ్ లో పవన్ చిత్రాలని అధికమించలేకున్నాయి.
