Asianet News TeluguAsianet News Telugu

కష్టాల్లో పవన్ కల్యాణ్.. లీగల్ చర్యలకు దిగిన మైత్రీ మూవీ మేకర్స్

  • పవన్ కల్యాణ్ పై లీగల్ చర్యలు
  • నోటీసులు పంపిన మైత్రీ మూవీ మేకర్స్?
  • అడ్వాన్స్ తీసుకుని సినిమాలు చేయలేదని నోటీసులిచ్చనట్లు వార్తలు
  • సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నోటీసుల వార్త
pawan kalyan in legal troubles

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కష్టాల్లో చిక్కుకున్నారు. ఇప్పటికే రాజకీయాలకోసం సినిమాలు వదిలేసిన పవన్ కళ్యాణ్ కు కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. పవన్ కళ్యాణ్ కు ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీస్ లీగల్ నోటీసులు పంపినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తల్లో ఎంత వరకు వాస్తవం ఉందో తెలియదు కానీ పవన్ అభిమానులు మాత్రం సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంతో ఆందోళన చెందుతున్నారు.

 

మైత్రి మూవీస్ బ్యానర్ పై రెండు చిత్రాలు చేయడానికి అంగీకరించిన పవన్ కోట్లల్లో నిర్మాతల నుంచి అడ్వాన్స్ తీసుకున్నాడనే వార్తలు ఎప్పటినుంచో వస్తున్నాయి. దాదాపు 20 కోట్లు అడ్వాన్స్ రూపంలోనే పవన్ తీసుకున్నాడట. ఈ ఒప్పందం ప్రకారం పవన్ వారికీ రెండు సినిమాలు చేసి పెట్టాలి. కందిరీగ ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ మైత్రి మూవీస్ నిర్మాణంలో రూపు దిద్దుకోబోయే పవన్ చిత్రానికి దర్శకుడంటూ కూడా వార్తలు వచ్చాయి. ఇప్పటికే సంతోష్ శ్రీనివాస్ పవన్ కోసం ఓ తమిళ కథలో మార్పులు చేసుకుని రెడీగా ఉంచుకున్నాడని ప్రచారం జరిగింది.

 

పవన్ కళ్యాణ్ తానూ ముందుగా కమిటై ఉన్న సినిమాలు పూర్తి చేసే లోపలే ఎన్నికల ఏడాది కూడా వచ్చేసింది. పవన్ కళ్యాణ్ ఓ రాజకీయ పార్టీకి అధినేత కూడా. కాబట్టి ఇక ఆలస్యం చేస్తే పార్టీకి భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని భావించిన పవన్ కళ్యాణ్ సినిమాలకు గుడ్ బై చెప్పేసాడు. దీనితో పవన్ తో సినిమా నిర్మించాలనుకున్న మైత్రి మూవీస్ వారి కోరిక కలగానే ఉండిపోయింది.

 

చాలా మంది నిర్మాతలు పవన్ కోసం క్యూలో ఉన్నారు. మైత్రి మూవీ మేకర్స్ మాత్రమే కాదు.. పవన్ కళ్యాణ్ తో ఖుషి వంటి ఇండస్ట్రీ హిట్ సినిమా రూపొందించిన ఏఎం రత్నం కూడా పవన్ కళ్యాణ్ కోసం ఎదురుచూపులు చూస్తున్నాడు. రత్నం నిర్మాణంలో ఆర్టీ నేసన్ దర్శత్వంలో ఓ చిత్రం ప్రారంభం అయింది కూడా. అది పూజా కార్యక్రమాలతోనే ఆగిపోయింది. పవన్ కళ్యాణ్ తో సినిమా నిర్మించాలని కలగన్న వారిలో దిగ్గజ దర్శకులు స్వర్గీయ దాసరి నారాయణ రావు కూడా ఉన్నారు. పవన్ తో సినిమా నిర్మించబోతున్నానంటూ అధికారికంగా ప్రటించారు కూడా. కానీ అది కార్యరూపం దాల్చే సమయానికి ఆయన కన్ను మూశారు.

 

మరోవైపు అడ్వాన్స్ తీసుకుని కాలయాపన చేస్తున్న పవన్ కళ్యాణ్ పై మైత్రి నిర్మాతలు ఆగ్రహంతో ఉన్నారని వార్త సోషల్ మీడియాలో దావానలంలా వ్యాపిస్తోంది. పవన్ ని చట్టపరంగా ఎదుర్కొనాలని నోటీసులు పంపినట్లు వార్తలు వస్తున్నాయి. ఇది సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారమేనా ఇందులో వాస్తవం ఎంత అనే విషయాలపై క్లారిటీ రావలసి ఉంది.

Follow Us:
Download App:
  • android
  • ios