అటు పాలిటిక్స్.. ఇటు సినిమాలు టైట్ షెడ్యూల్ లో బీజీ బిజీగా గడిపేస్తున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఈమధ్య వరకూ హాట్ హాట్ పాలిటిక్స్ తో హిటెట్కిపోయిన పవర్.. ఇక షూటింగ్ కోసం రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.  

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న సినిమా హరిహర వీరమల్లు. సూపర్ ఫాస్ట్ గా షూటింగ్ జరుపుకుంటున్న ఈసినిమాకు మధ్య మధ్యలో బ్రేకులు తప్పడంలేదు. ఇప్పటికే ఈమూవీ షూటింగ్ చాలా వరకూ కంప్లీట్ అయ్యింది. టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ తెరకెక్కిస్తున్న ఈసినిమాపై పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. పీరియాడికల్ ఫిక్షన్ కథతో హరిహరవీరమల్లు రూపోందుతుంది. 

రీసెంట్ ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను పూర్తి చేసిన వీరమల్లు టీమ్, ఇప్పుడు తన నెక్ట్స్ షెడ్యూల్‌ను పట్టాలెక్కించేందుకు రెడీ అవుతోంది.ఈ క్రమంలో జనవరి 17 నుండి ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ షూటింగ్‌ను ప్రారంభించాలని పవన్ అండ్ టీమ్ భావిస్తున్నారట. ఇప్పటికే ఈ షెడ్యూల్ కోసం సారథి స్టూడియోస్‌లో ఓ సెట్ కూడా వేశారట. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఈ షెడ్యూల్ ను పూర్తి చేయాలని చూస్తున్నారు.. దర్శకుడు క్రిష్ ఆవిధంగా ప్లాన్ చేస్తున్నాడట. 

ఈ సినిమాలో పవన్ సరికొత్త అవతారంలో కనిపించబోతున్నట్టు తెలిసిందే. దీనికోసం గతంలో పవర్ స్టార్ నేర్చుకున్న కర్రసాము, కరాటే లాంటివి మళ్ళీ ప్రాక్టీస్ చేసి..సాన పెట్టాడు పవన్.ఆడియన్స్ తో పాటు అభిమానుల్లో కూడా ఈ సినిమాపై అంచనాలను ఓ రేంజ్‌లో క్రియేట్ అవుతున్నాయి. ఇక ఈమూవీకి సబంధించి మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటీ అంటే.. ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాన్ క్యారెక్టర్ రాబిన్‌హుడ్ తరహాలో ఉండబోతుందని తెలుస్తోంది. 

ఇక ఈ సినిమాలో పవన్ కల్యాణ్ జోడీగా కన్నడ సోయగం నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోండగా, బాలీవుడ్ నటుడు బాబీ డియోల్, హాట్ బ్యూటీ నోరా ఫతేహి ఈ సినిమాలో ఓ మొఘల్ రాకుమారి పాత్రలో నటిస్తోంది. ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం హరిహరవీరమల్లు సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు, అంతే కాదు ఈ సినిమాను పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ చేయాలనిప్లనా్ చేస్తున్నారు టీమ్.