పవన్‌ కళ్యాణ్‌ నటిస్తున్న `హరిహర వీరమల్లు` సినిమా నుంచి ఓ బ్యాడ్‌ న్యూస్‌ వినిపిస్తుంది. ఈ నెల 12న విడుదల కావాల్సిన ఈ మూవీ మరోసారి వాయిదా పడుతుంది.

పవన్‌ కళ్యాణ్‌(Pawan Kalyan) ఫ్యాన్స్ కి మరో షాక్‌ తగిలింది. ఆయన సినిమా నుంచి అభిమానులను డిజప్పాయింట్‌ చేసే వార్త బయటకు వచ్చింది. ఎన్నో రోజులుగా వెయిట్‌ చేస్తున్న `హరిహర వీరమల్లు`(HariHara VeeraMallu) మూవీ మరోసారి వాయిదా పడుతుంది. జూన్‌ 12న ఈ మూవీని గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నట్టు టీమ్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. 

ఈ మేరకు ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు. ‌సాంగ్స్ రిలీజ్‌ చేశారు. అంతేకాదు ఓవర్సీస్‌లో బుకింగ్స్ కూడా ఓపెన్‌ చేశారు. టికెట్‌ రేట్లు పెంచడానికి నిర్మాత ఏఎం రత్నం తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కి రిక్వెస్ట్ లెటర్‌ పెట్టారు. తిరుపతిలో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి కూడా ప్లాన్‌ చేశారు.

`హరిహర వీరమల్లు` మూవీ మరోసారి వాయిదా

పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్స్ ఈ మూవీ కోసం ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు. కానీ ఇంతలోనే షాకిచ్చే వార్త బయటకు వచ్చింది. `హరిహర వీరమల్లు` మరోసారి వాయిదా పడుతుందనే వార్తలు గుప్పుమంటున్నాయి. అవి సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

చిత్ర బృందం నుంచి తెలుస్తున్న సమాచారం మేరకు ఈ మూవీ వాయిదా కన్ఫమ్‌ అయినట్టు తెలుస్తుంది. జూన్‌ 12న ఈ చిత్రం విడుదల కావడం లేదని కన్ఫమ్‌ చేస్తున్నారు. జులైకి వాయిదా పడే అవకాశం ఉందట. జులై 4నగానీ, ఆ తర్వాత వారం గానీ విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తుంది.

పవన్‌ కళ్యాణ్‌ `హరిహర వీరమల్లు` వాయిదాకి కారణాలివే 

`హరిహర వీరమల్లు` సినిమా వాయిదాకి కారణాలేంటనేది చూస్తే, రెండు మూడు ప్రధాన కారణాలు వినిపిస్తున్నాయి. సీజీ వర్క్ పూర్తి కాలేదని అంటున్నారు. ఇటీవలే పవన్‌ కళ్యాణ్‌ షూటింగ్‌లో పాల్గొన్నారు. వేగంగా చిత్రీకరణ పూర్తి చేశారు. 

అయితే వాటికి సంబంధించిన కొంత సీజీ వర్క్ పెండింగ్‌లో ఉందట. అనుకున్న టైమ్‌కి ఫైనల్‌ కాపీ రాలేని పరిస్థితి ఏర్పడిందని, దీంతో వాయిదా వేస్తున్నట్టు తెలుస్తుంది.

పవన్‌ కళ్యాణ్‌ రూ.11 కోట్లు ఇచ్చినా సెటిల్‌ కాలేదా?

ఈ సినిమా వాయిదాకి మరో కారణం కూడా వినిపిస్తుంది. సినిమా ఫైనాన్స్ క్లీయరెన్స్ కూడా కావాల్సి ఉందట. అందుకే ఇటీవల పవన్‌ కళ్యాణ్‌ తన పారితోషికంలో రూ.11 కోట్లు వెనక్కి ఇచ్చారట. అయినా ఇంకా సెటిల్‌ కాలేదని అంటున్నారు.

 దీనికితోడు `హరిహర వీరమల్లు` సినిమా బిజినెస్‌ కూడా కాలేదనే టాక్‌ వినిపిస్తుంది. ఈ విషయంలోనే నిర్మాత ఇబ్బంది పడుతున్నట్టు తెలుస్తుంది. అందుకే రిలీజ్‌ విషయంలో వెనకగడుగు వేసినట్టు సమాచారం. సినిమా వాయిదా పడుతున్న నేపథ్యంలో ఓవర్సీస్‌లో అడ్వాన్స్ గా టికెట్స్ బుక్ చేసుకున్న వారికి మనీ రిటర్న్ చేస్తున్నారట. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. 

కానీ ఏపీ డిప్యూటీ సీఎం, పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ మూవీకి ఇలాంటి పరిస్థితి రావడం విచారకరం. ఇప్పటికే ఈ మూవీ అనేకసార్లు వాయిదా పడింది. ఇప్పుడైనా రిలీజ్‌ అవుతుందని ఆశగా ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి నిరాశనే ఎదురు కావడం బాధాకరం.

పవన్‌ కళ్యాణ్‌ హీరోగా రూపొందుతున్న `హరిహర వీరమల్లు` చిత్రానికి జ్యోతికృష్ణ దర్శకుడు. ఏఎం రత్నం నిర్మిస్తున్నారు. ఇందులో బాబీ డియోల్‌ నెగటివ్‌ రోల్‌ చేస్తుండగా, నిధి అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తుంది.