పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన పొలిటికల్ టూర్లతో బిజీగా ఉన్నాడు. ఎలక్షన్స్ దగ్గరలో ఉండటంతో.. పార్టీపై దృష్టి పెట్టాడు. మరి ఈక్రమంలో ఆయన చేయాల్సిన సినిమాల పరిస్థితి ఏంటి..? ముఖ్యంగా హరిహర వీరమల్లు సంగతేంటి..?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ హిస్టారికల్ సినిమా హరిహర వీరమల్లు. ఈ మూవీ షూటింగ్ చాలా వరకూ పెండింగ్ ఉంది. ఇంత వరకూ పెద్దగా ముందుకు కదిలింది లేదు సినిమా. ఈమూవీ కోసం వేసిన సెట్లు కూడా పాడైపోయాయి. ఇక ఫిక్న్ కథతో..డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతోన్న ఈసినిమాపై రకరకాల రూమర్లు వినిపనిస్తున్నాయి. ఈ మూవీలో పవన్ చేయాలి అటే హడావిడి లేకుండా ఉండాలి. ప్రశాంతంగా షూటింగ్ చేసుకోవాలి.. మేకప్.. యాక్షన్ సీన్స్ ఇవన్నీ టైమ్ పడతాయట. దాంతో పవన్ ఈమూవీ షైూటింగ్ ను పోస్ట్ పోన్ చేస్తూ వస్తున్నట్టు తెలుస్తోంది.
అందులోను పవర్ పొలిటికల్ ప్రెజర్ లో ఉన్నాడు. అలాంటప్పుడు సినిమాలు చేసినా.. ఏవైనా సింపుల్ గా అయిపోయే సినిమాలు చేయాలని అలా చేస్తేనే బాగుంటుంది అని అనకుంటున్నాడట. అందుకే ఈ టైట్ షెడ్యూల్ లో కూడా బ్రో మూవీ కంప్లీట్ చేశాడు..ఓజీకి కూడా టైమ్ ఇచ్చాడు. కాని హరిహర వీరమల్లు మాత్రం అలాగే పెండింగ్ పడిపోతూ ఉంది షూటింగ్. అయితే ఈక్రమంలో సెప్టెంబర్ రెండో వారం నుంచి పవన్ ఈ సినిమాకి డేట్స్ కేటాయించే అవకాశం ఉన్నట్లు వార్తలు వచ్చాయి. కానీ, తాజాగా ఈ సినిమా షూటింగ్ పై మరో కొత్త రూమర్ వినిపిస్తోంది.
పవన్ ఈ సినిమాకి ఇప్పట్లో డేట్స్ ఇచ్చే ఛాన్స్ లేదని.. వచ్చే ఏడాది ఏపీలో జరిగే ఎన్నికల తర్వాతే.. పవన్ ఈ సినిమాకి డేట్స్ ఇస్తాడని టాక్ నడుస్తోంది. అలాగే, వచ్చే ఏడాది దసరాకి ఈ సినిమాని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. మరి అలా చూసుకుంటే పవర్ స్టార్ డేట్స్ లేకపోతే.. నెక్ట్స్ ఎలక్షన్స్ తరువాతే డేట్స్ ఇస్తారంటే.. మూవీ 2025 లోనే రిలీజ్ అవుతుదన్న అనుమానం వ్యాక్తం అవుతుంది. ఈలెక్కన్న పవర్ స్టార్ ఫ్యాన్స్ లో కూడా ఈసినిమాపై ఆశలు సన్నగిల్లుతున్నాయి. మరి ఈ మధ్యలో ఏదైనా మిరాకిల్ జరిగి.. ఈసినిమాకు పవర్ స్టర్ కాల్షీట్లు ఇస్తారా..? లేదా అనేది చూడాలి.
ఇక మొఘల్ కాలం నాటి ఫిక్షన్ కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమాలో పవర్ స్టార్ జోడీగా నిధి అగర్వాల్ నటిస్తుండగా జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఓ కీలక పాత్ర చేస్తోంది. ఈ సినిమాని పాన్ ఇండియా సినిమాగా తీసుకురానున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత ఏ ఎం రత్నం ఈ సినిమాని భారీగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం పవన్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరీ ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.
