సంతోష్ శ్రీనివాస్ కు క్లారిటీ ఇచ్చేసిన పవన్

First Published 10, Mar 2018, 10:41 AM IST
Pawan kalyan Green Signal to movie with Santosh Srinivas
Highlights
  • పవర్ స్టార్ ఇక సినిమాలు ఆపేయడం పక్కా అని అందరూ ఒక క్లారిటీతో ఉన్నారు
  • పవన్ అజ్ఞాతవాసి సినిమా చేస్తున్న టైంలోనే మైత్రీ మూవీ మేకర్స్ వాళ్లకు ఓ సినిమా చేస్తానని చెప్పాడు​

 పవర్ స్టార్ ఇక సినిమాలు ఆపేయడం పక్కా అని అందరూ ఒక క్లారిటీతో ఉన్నారు. సంతోష్ శ్రీనివాస్ ఎన్టీఆర్ తోరభస సినిమా దారుణంగా ఫ్లాప్ అయ్యింది. అసలు విషయంలోకి వెళితే..

 పవన్ అజ్ఞాతవాసి సినిమా చేస్తున్న టైంలోనే మైత్రీ మూవీ మేకర్స్ వాళ్లకు ఓ సినిమా చేస్తానని చెప్పాడు. అడ్వాన్స్ కూడా అందుకున్నాడనే సమాచారం. పవన్ సూచనల మేరకు విజయ్ నటించిన తెరి చిత్రం ఆధారంగా దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ కొత్త కథనంతో స్క్రిప్ట్ రాసుకున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రానికి రీమేక్ రైట్స్ కూడా కొనుగోలు చేసింది. అప్పటికే పోలీసోడు అంటూ ఆ సినిమా తెలుగులో వచ్చేసినా..  కేవలం 40 రోజుల కాల్షీట్స్ తో భారీగా రెమ్యూనరేషన్ ముట్టచెప్పేలా.. పవన్ ఈ చిత్రం చేస్తాడని అప్పట్లో వార్తలు వచ్చాయి.

కానీ ఇప్పుడు తను సినిమా చేయడం సాధ్యం కాదని తేల్చేశాడట పవర్ స్టార్. సంతోష్ శ్రీనివాస్ వేరే హీరోతో తన తర్వాతి సినిమాను రూపొందించడంపై అభ్యంతరాలు లేవని కూడా తేల్చేశాడట. అలాగే మైత్రీ మూవీ మేకర్స్ కు కూడా తను తీసుకున్న అడ్వాన్స్ ను త్వరలోనే తిరిగిచ్చేస్తానని చెప్పాడట పవన్ కళ్యాణ్. 

loader