సాయిధరమ్‌ తేజ్‌(sai dharam tej) నటిస్తున్న `రిపబ్లిక్‌`(republic) చిత్రం అక్టోబర్‌ 1న విడుదల కానుంది. ఇటీవల `రిపబ్లిక్‌` ట్రైలర్‌ని రిలీజ్‌ చేసి సినిమాపై హైప్‌ని పెంచేశారు మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi). ప్రస్తుతం పవన్‌ కళ్యాణ్‌(pawan kalyan) సైతం సాయి కోసం కదిలాడు.

ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న సాయిధరమ్‌ తేజ్‌(sai dharam tej)కోసం మెగా ఫ్యామిలీ కదులుతుంది. ఆయన నటించిన సినిమా కోసం చిరంజీవి(chiranjeevi), పవన్‌ కళ్యాణ్‌(pawan kalyan) సైతం ముందుకొస్తున్నారు. సినిమాని సపోర్ట్ చేసేందుకు కదిలి వస్తున్నారు. సాయిధరమ్‌ తేజ్‌ నటిస్తున్న `రిపబ్లిక్‌`(republic) చిత్రం అక్టోబర్‌ 1న విడుదల కానుంది. ఇటీవల `రిపబ్లిక్‌` ట్రైలర్‌ని రిలీజ్‌ చేసి సినిమాపై హైప్‌ని పెంచేశారు మెగాస్టార్ చిరంజీవి. సాయి గురించి ఆసక్తికర విషయాలను తెలిపి ఎమోషనల్‌ అయ్యారు చిరంజీవి. ట్రైలర్‌ని వరుణ్‌ తేజ్‌ వంటి వారు అభినందిస్తూ దాన్ని షేర్‌ చేశారు.

తాజాగా సాయిధరమ్‌ తేజ్‌ కోసం పవన్‌ కళ్యాణ్‌ వస్తున్నారు. సాయిధరమ్‌ తేజ్‌ నటించిన `రిపబ్లిక్‌` ప్రిలీజ్‌ ఈవెంట్‌ని శనివారం హైదరాబాద్‌లోని జేఆర్‌సీలో నిర్వహించబోతున్నారు. ఈ ఈవెంట్‌కి పవన్‌ కళ్యాణ్‌ గెస్ట్ గా రాబోతుండటం విశేషం. తాజాగా ఈ విషయాన్ని చిత్ర యూనిట్‌ వెల్లడించింది. `పవన్‌ కళ్యాణ్‌ ఫర్‌ సాయిధరమ్‌ తేజ్‌` అంటూ ఓ స్పెషల్‌ వీడియోని అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో బాగా ఆకట్టుకుంటోంది. 

Scroll to load tweet…

సాయిధరమ్‌ తేజ్‌, ఐశ్వర్యా రాజేష్ దేవాకట్టా దర్శకత్వం వహించారు. భగవాన్‌, పుల్లారావు నిర్మించారు. ఈ సినిమా అక్టోబర్‌ 1న థియేటర్లో రిలీజ్‌ కాబోతుంది. మరోవైపు సాయిధరమ్‌ తేజ్‌ ఇటీవల బైక్‌ పై నుంచి రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఆయన ప్రస్తుతం అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. చాలా వరకు కోలుకున్నారని, మాట్లాడుతున్నారని, మరికొన్ని రోజుల్లో పూర్తి స్థాయిలో సాయిధరమ్‌ కోలుకుంటారని వైద్యులు తెలిపారు.