దర్శనం మొగులయ్య పవన్‌ కళ్యాణ్‌ నటిస్తున్న `భీమ్లా నాయక్‌` చిత్రంలోని టైటిల్‌ సాంగ్‌లో ఇంట్రోని ఆలపించిన విషయం తెలిసిందే. భీమ్లా నాయక్‌ గురించి ఆయన ఇచ్చిన సాంగ్‌ ఇంట్రడక్షన్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. 

కిన్నెర కళాకారులు దర్శనం మొగులయ్య కి జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ రూ.2 లక్షల ఆర్థిక సాయాన్ని అందచేశారు. ఆదివారం ఉదయం హైదరాబాద్ లోని జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కల్యాణ్ రూ.2 లక్షల చెక్కును మొగులయ్య కి అందచేసి సత్కరించారు. తెలంగాణ జానపద కళలపై పరిశోధన చేసిన డా.దాసరి రంగాకి రూ.50 వేలు చెక్కు ఇచ్చి సన్మానించారు. తన ట్రస్ట్ `పవన్ కల్యాణ్ లెర్నింగ్ సెంటర్ ఫర్ హ్యూమన్ ఎక్సిలెన్స్` నుంచి పవన్ కల్యాణ్ ఈ ఆర్థిక సాయాన్ని అందించారు.

దర్శనం మొగులయ్య పవన్‌ కళ్యాణ్‌ నటిస్తున్న `భీమ్లా నాయక్‌` చిత్రంలోని టైటిల్‌ సాంగ్‌లో ఇంట్రోని ఆలపించిన విషయం తెలిసిందే. భీమ్లా నాయక్‌ గురించి ఆయన ఇచ్చిన సాంగ్‌ ఇంట్రడక్షన్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. తాజాగా పవన్‌ తనని ఆదుకోవడంతో మొగులయ్య ఆనందం వ్యక్తం చేశారు. పవన్‌కి ధన్యవాదాలు తెలిపారు. 

ఇకక పవన్‌ కళ్యాణ్‌ నటిస్తున్న `భీమ్లా నాయక్‌` చిత్రానికి సాగర్‌ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో రానా మరో హీరో. త్రివిక్రమ్‌ మాటలు, స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. పవన్‌ సరసన నిత్యా మీనన్‌, రానా సరసన ఐశ్వర్యా రాజేష్‌ నటిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇటీవల పవన్‌ కళ్యాణ్‌ బర్త్ డే సందర్భంగా `భీమ్లా నాయక్‌` చిత్ర టైటిల్‌ సాంగ్‌ని విడుదల చేసిన విషయం తెలిసిందే.