పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్స్ ని సర్‌ప్రైజ్‌ చేయబోతున్నారు. ఎవరూ ఊహించని విధంగా ఫస్ట్ టైమ్‌ అభిమానులను ఖుషీ చేయాలని నిర్ణయించారు. ఆయన ఓ ఓ టీవీ షోలో పాల్గొనబోతున్నట్టు తెలుస్తుంది. ఇది వినడానికి నమ్మశక్యంగా లేకపోయినా త్వరలో ఇది నిజం కాబోతుందని టాక్‌. ఇప్పటి వరకు పవన్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ టీవీ షోస్‌లో పాల్గొన్నది లేదు. ఆయన సినిమా విడుదల సమయంలో కూడా మీడియాకి ఇంటర్వ్యూలు ఇవ్వరు. ఒకవేళ ఇచ్చినా.. కొన్ని పెద్ద మీడియా సంస్థలకే ఇస్తారు. చిన్న వాటిని దూరం పెడతారు. 

కానీ ఇప్పుడు రూట్‌ మార్చారని తెలుస్తుంది. తన సినిమా ప్రమోషన్‌ కోసం టీవీ షోస్‌లో ఇంటర్వ్యూలు ఇవ్వాలని నిర్ణయించారని ఓ వార్త సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నారు. ప్రస్తుతం పవన్‌ `వకీల్‌సాబ్‌` చిత్రంలో నటిస్తున్నారు. వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. బాలీవుడ్‌లో విజయం సాధించిన `పింక్‌` చిత్రానికిది రీమేక్‌. శృతి హాసన్‌ ఇందులో హీరోయిన్‌గా నటిస్తుండగా, నివేదా థామస్‌, అంజలి కీలక పాత్రలు పోషిస్తున్నారు. సినిమా షూటింగ్‌ పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్‌ వర్క్ జరుగుతుంది. ఏప్రిల్‌ 9న సినిమా విడుదల కానుంది. 

ఈ సినిమా ప్రమోషన్‌ కోసం టీవీ షోలో పాల్గొననున్నారని టాక్‌. అది కూడా ప్రదీప్‌ హోస్ట్ గా చేయబోతున్న `కొంచెం టచ్‌లో ఉంటే చెబుతా` షోకి రానున్నారట. త్వరలో ఈ సీజన్‌ షో ప్రారంభం కానుంది. ఇటీవల ప్రదీప్‌ హీరోగా మారి `30 రోజుల్లో ప్రేమించడం ఎలా` చిత్రంతో మంచి ప్రశంసలందుకున్నారు. సినిమాకి పాజిటివ్‌ టాక్‌ వస్తోంది. ఈ ఆనందంలో పవర్‌ స్టార్ ఏకంగా తమ షోలో పాల్గొనేందుకు రెడీ కావడం ప్రదీప్‌ ఆనందానికి అవదుల్లేవనే చెప్పాలి.