పవన్ కళ్యాణ్ ఇంట్లో విషాదం అంటూ ఓ రూమర్ సంచలనమై పోయింది.పవన్ మూడో భార్య అన్నా లెజెనోవా. ఆమె తల్లి మరణించిందనీ.. పవన్ కుటుంబం విషాదంలో ఉందని రూమర్ వచ్చింది. ఇవి పవన్ కళ్యాణ్ వరకు చేరాయి. అసలే రాజకీయ యాత్రలో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ కు ఈ వార్తలు తలనొప్పిగా మారాయి. పవన్ మేనేజర్ వెంటనే స్పందించాడు. ఆ వార్తలన్నీ అవాస్తవమని... ఆయన మీడియాకు తెలియజేశాడు. పవన్ కుటుంబసభ్యులు ఆరోగ్యంగా ఉన్నారని చెప్పాడు. ఇలాంటి వార్తలు వచ్చినప్పుడు కనీస జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఒకసారి నిజమా కాదో తెలుసుకున్నాకే పబ్లిష్ చేయాలని కోరారు. ఇలాంటివి మరోసారి జరగకూడదని పవన్ కూడా తన మేనేజర్ ని గట్టిగా హెచ్చరించారు.

ఈ విషయంలో కొన్ని యూట్యూబ్ ఛానెళ్లు ఏకంగా రేణు దేశాయ్ స్పందన అని కూడా రాశారు. ఆమె సంతాపం వ్యక్తం చేశారని ప్రచారం చేశారు. ఈ రేంజ్లో అబద్ధాన్ని సృష్టించి ప్రచారం చేయడం మంచిది కాదన్న అభిప్రాయం వ్యక్తం చేశారు.