తనకు సినిమాల మీద ఆసక్తి లేదని రాజకీయాలే ప్రస్తుతం తన లక్ష్యమని తెగేసి చెప్పేశాడు పవన్ కళ్యాణ్. ఒప్పుకున్న సినిమాలు కూడా చేయడం లేదని టాక్ వచ్చేసింది. ఈ వార్తలు అభిమానుల గుండెలను పిండేశాయి. తమ అభిమాన నటుడిని తెరపై ఇక చూడలేమోమో అని ఎంతో ఫీలయ్యారు. ఇప్పుడు వారికి ఊరట కలిగించే వార్త ఇది. 

పవన్ కళ్యాణ్ నటించరు... అది నిజమే. అయితే పూర్తిగా సినిమాలను మాత్రం వదిలేయరు. ఒక పక్కన రాజకీయ నేతగా కొనసాగుతూనే మరో పక్క తనకు జీవితాన్నిచ్చిన సినిమాలనూ నడిపిస్తాడు. అలాగని పూర్తిగా తెరపై కనపడరా అంటే... అదీ లేదు. అప్పుడప్పుడు అతిధి పాత్రలో  మెరిసే అవకాశం ఉంది. కనుక నటనకు గుడ్ బై చెప్పేస్తాడేమో పవన్ అని బెంగపెట్టేసుకోకండి. ఏఎమ్ రత్నం నిర్మాతగా ఓ సినిమాను  దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ సినిమాలను పవన్ చేయాల్సి ఉంది. అలాగే కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తయారుచేసిన స్క్రిప్ట్ కూడా పవన్ కు తెగనచ్చేసిందని తెలిసింది. అయితే వాటిలో పవన్ నటించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేశారు. ఆయన నటించకపోయినా... ఆ సినిమాలను ప్రొడ్యూస్ చేసే అవకాశం లేకపోలేదు.  

పీకే క్రియేటివ్ వర్క్స్ పేరుతో సినిమాలను ప్రొడ్యూస్ చేయాలనే ఆలోచన కూడా ఉంది ఈ జనసేత అధినేతకు. ఏడాదికి రెండు చిత్రాలను నిర్మించాలన్న పవన్ ప్లాన్. ఆల్రెడీ నితిన్ తో ఇదే బ్యానర్ పై లిరిక్ రైటర్ కృష్ణ చైతన్య ఆధ్వర్యంలో ఒక సినిమాను చేస్తున్నాడు. ఇక ఇటువంటి సినిమాలలోనే తాను అతిధి పాత్రలో కనిపించి అభిమానుల కోరిక తీర్చవచ్చు. ఇందులో ఏది జరుగుతుందో కాలమే చెప్పాలి.