పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ మాజీ భార్య సూపర్‌ స్టార్‌ మహేష్‌కి వదిన అవుతుందట. పవన్‌కి, మహేష్‌కి రిలేషన్‌ ఏంటీ? అనుకుంటున్నారా? అన్ని కుదిరితే సిల్వర్‌ స్క్రీన్‌పై ఈ రిలేషన్‌ సెట్‌ కాబోతుంది. మహేష్‌ ప్రస్తుతం పరశురామ్‌ దర్శకత్వంలో `సర్కారు వారి పాట` చిత్రంలో నటిస్తున్నారు. ఇది ఇప్పటికే పూజా కార్యక్రమాలను ప్రారంభించుకుంది. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. 

ఇందులో కీర్తిసురేష్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా మైత్రీ మూవీస్‌, జీఎంబీ, 14ప్లస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై ఈ సినిమా తెరకెక్కనుంది. ఇందులో పవన్‌ కళ్యాణ్‌ మాజీ భార్య రేణు దేశాయ్‌ నటించనున్నారట. మహేష్‌ బాబు వదిన పాత్ర కోసం ఆమెని సంప్రదించారట. అందుకు రేణు కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇదే నిజమైతే, పవన్‌ మాజీ భార్య, మహేష్‌కి వదిన కాబోతుందని చెప్పొచ్చు.

ఇదిలా ఉంటే గతంలోనే రేణు ఇందులో నటించబోతున్నట్టు వార్తలొచ్చాయి. కానీ దీన్ని ఆమె ఖండించారు. ఇప్పుడు మరోసారి ఆ వార్తలు వినిపించడంతో కచ్చితంగా ఇది నిజమే అనే టాక్‌ వినిపిస్తుంది. దీనిపై చిత్ర బృందం స్పందిస్తేగానీ తెలుస్తుంది. సినిమా బ్యాంక్‌ కుంభకోణాల నేపథ్యంలో సాగుతుందని, ఇందులో మహేష్ బ్యాంక్‌ ఎంప్లాయ్‌గా కనిపిస్తారని సమాచారం. సందేశం, వాణిజ్య అంశాల మేళవింపుగా సినిమా ఉంటుందని టాక్‌.