Renu Desai-Akira: పవన్ మాజీ భార్య రేణూ దేశాయ్ తోపాటు కొడుకు అకీరాకు కరోనా

పవన్ కళ్యాణ్ (Pawan Kalayan) మాజీ భార్య రేణూ దేశాయ్, కొడుకు అకీరా కరోనా బారినపడ్డారు. కొద్దిసేపటి క్రితం ఇంస్టాగ్రామ్ వేదికగా రేణూ దేశాయ్ ఈ విషయాన్ని ఫ్యాన్స్ తో పంచుకున్నారు. 
 

pawan kalyan ex wife renu desai and son akira tested covid positive

కాలు బయట పెడితే చాలు కరోనా (Corona Virus) ఎటాక్ చేస్తుంది. రోజుకో విధంగా పరిస్థితులు కఠినంగా మారుతున్నాయి. సామాన్యులు, ప్రముఖులు అనే బేధం లేకుండా కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. తాజాగా పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్, కొడుకు అకీరా లకు కరోనా సోకింది. కొద్దిసేపటి క్రితం సోషల్ మీడియా వేదికగా రేణూ దేశాయ్ ఈ విషయాన్ని ధృవీకరించారు.  'హ‌లో క‌రోనా స‌మ‌యంలో ఇంట్లోనే ఉన్న‌ప్ప‌టికీ.. న్యూ ఇయర్ వేడు‌క స‌మ‌యంలోనూ ఇంట్లోనే కూర్చున్నప్పటికీ నాలోను, అకీరాలోను  క‌రోనా ల‌క్ష‌ణాలు క‌న‌ప‌డ్డాయి.. వైద్య పరీక్షల్లో క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయింది. ప్ర‌స్తుతం ఇద్ద‌రం క‌రోనా నుంచి కోలుకుంటున్నాం' అని రేణూ దేశాయ్ ఇంస్టాగ్రామ్ లో సందేశం పోస్ట్ చేశారు. 

'నేను మీకు చేసే రిక్వెస్ట్ ఏంటంటే.. ప్ర‌తి ఒక్క‌రు థ‌ర్డ్ వేవ్ ను సీరియ‌స్‌గా తీసుకోండి. మాస్క్ ధ‌రిస్తూ వీలైనంత‌ జాగ్ర‌త్త‌గా ఉండండి. నేను గ‌త ఏడాది వ్యాక్సిన్ వేయించుకున్నాను. ఇప్పుడు అకీరా (Akira)కి వ్యాక్సిన్ వేయిద్దామ‌ని అనుకునే స‌మ‌యంలో అత‌డికి క‌రోనా సోకింది' అని రేణూ దేశాయ్ పేర్కొన్నారు. వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ కరోనా సోకడం ఆందోళన కలిగిస్తుంది. ఇక రేణూ, అకీరా ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నట్లు వెల్లడించారు. కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం ఏమీ లేదని గ్రహించవచ్చు. స్వల్ప లక్షణాలతో మైల్డ్ ఎటాక్ కి వీరు గురై ఉండవచ్చు. 

కాగా ఏడాది క్రితం రేణూ దేశాయ్ (Renu Desai)పూణే నుండి మకాం హైదరాబాద్ కి మార్చారు.అలాగే  నటిగా కమ్ బ్యాక్ ఇస్తున్నట్లు ప్రకటించిన ఆమె... ఇప్పటికే ఓ సిరీస్లో నటిస్తున్నట్లు సమాచారం. అలాగే సీరియల్ నటిగా కూడా తళుకున్న మెరిశారు. వృత్తిరీత్యా ఫ్యాషన్ డిజైనర్ అయిన రేణూ... దర్శకత్వం తో పాటు చిత్ర నిర్మాణం పై ఆసక్తిగా ఉన్నారు. స్వతహాగా రాసుకున్న కొన్ని స్క్రిప్ట్స్ తెరకెకెక్కించనున్నట్లు ఆమె గతంలో వెల్లడించారు. 

మరో వైపు టాలీవుడ్ లో వరుసగా కరోనా కేసులు నమోదవుతున్నాయి.  మ‌హేశ్ బాబు (Mahesh babu), రాజేంద్ర ప్ర‌సాద్, బండ్ల గ‌ణేశ్‌, మంచు లక్ష్మి, మంచు మ‌నోజ్ తో పాటు ప‌లువురు సినీ ప్ర‌ముఖుల‌కు కూడా క‌రోనా సోకిన విష‌యం తెలిసిందే. దీంతో వారు త‌మ కార్య‌క్ర‌మాల‌న్నింటినీ వాయిదా వేసుకుని చికిత్స తీసుకుంటున్నారు. అలాగే లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ సైతం కరోనా బారినపడ్డారు. ఆమెకు ముంబైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by renu (@renuudesai)

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios