Pawan Kalyan; పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘హరి హర వీరమల్లు’ అప్‌డేట్ కోసం ఫ్యాన్స్ తెగ ఎదురుచూస్తున్నారు. పవన్ ఏడాది కాలంగా రాజకీయాల్లో బిజీగా ఉండటం వల్ల ఆయన సినిమా షూటింగ్‌లు అన్నీ నెమ్మదిగా సాగుతున్నాయి. రీసెంట్‌గా రాజకీయాలకు కాస్త బ్రేక్ ఇచ్చి.. ఇప్పటికే ఒప్పుకున్న సినిమాల షూటింగుల్లో పాల్గొంటున్నారు. ఇక హరిహరవీరమల్లు సినిమా త్వరలో విడుదలవుతున్న నేపథ్యంలో ఈ చిత్రానికి సంబంధించి ఓ విషయం తాజాగా హల్ చల్ చేస్తోంది.
హరిహరవీరమల్లు క్రిష్, జ్యోతి కృష్ణ డైరెక్షన్‌లో పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్‌గా రూపొందుతోంది. రీసెంట్‌గా సినిమాకు సంబంధించి దర్శకుడు జ్యోతికృష్ణ ఓ ఆసక్తికర అంశాన్ని పంచుకున్నారు. ఈ లీక్‌తో ఒక్కసారిగా సినిమాపై అంచనాలు పెంచేశారు.
సినిమాలో మొత్తం ఆరు యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయని డైరెక్టర్ తెలిపారు. అంతేకాకుండా ఈ చిత్రంలో ఓ భారీ యాక్షన్ సన్నివేశాన్ని పవన్ కల్యాణ్ డైరెక్ట్ చేశాడని జ్యోతిక్రిష్ణ చెబుతున్నారు. సినిమాలో యాక్షన్ సన్నివేశం అద్బతంగా వచ్చిందని హైలెట్‌గా నిలుస్తుందని డైరెక్టర్ జ్యోతిక్రిష్ణ అన్నారు.
ఈ భారీ సీక్వెన్స్‌లో సుమారు 1100 మంది ఆర్టిస్టులు పాల్గొన్నారని, హైదరాబాద్‌లోని ప్రైవేట్ స్టూడియోలో 61 రోజులు ఈ సీన్ని తీసినట్లు చెప్పుకొచ్చారు. ముఖ్యంగా పవన్ ఈ సీన్‌కోసం చాలా వర్క్ చేశారని, ప్రపంచ స్థాయి స్టంట్ మాస్టర్లతో చర్చించారన్నారు. సినిమాకు ఈ సీన్ హైలైట్ అవుతుందన్నారు డైరెక్టర్ జ్యోతికృష్ణ. వీరమల్లు క్యారెక్టర్ కోసం ప్రత్యేకంగా పవన్ గుర్రపు స్వారీ నేర్చుకున్నారన్నారు. 
పవన్ హీరోగా తెరకెక్కుతున్న హరిహరవీరమల్లు మే 9న విడుదలవబోతోంది. కల్యాణ్ సరసన నిధి అగర్వాల్ నటిస్తోంది. హీరోయిన్ ఈ మధ్య ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ ప్రతి సీన్‌ను దగ్గరుండి పర్యవేక్షించారని అన్నారు. ప్రతి యాక్షన్ సీన్ బాగా వచ్చిందని అందులో పవన్ భాగస్వామ్యం ఉందన్నారు. రెండు పార్ట్‌లుగా ఈ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మొదటి పార్ట్ ‘హరి హర వీరమల్లు పార్ట్-1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ పేరుతో త్వరలో విడుదల కానుంది.
