తండ్రి బాటలో ఆద్య, పవన్ కళ్యాణ్ కుమార్తె కరాటే నేర్చుకుంటోందా.. వైరల్ వీడియో

పవన్ కళ్యాణ్ తో విడిపోయిన తర్వాత రేణు దేశాయ్ సింగిల్ గానే ఉంటూ తన పిల్లల భాద్యతలు చూసుకుంటోంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ రేణు దేశాయ్ తన పిల్లల గురించి అనేక విశేషాలు పంచుకోవడం చూస్తూనే ఉన్నాం.

Pawan Kalyan daughter martial arts video goes viral dtr

పవన్ కళ్యాణ్ తో విడిపోయిన తర్వాత రేణు దేశాయ్ సింగిల్ గానే ఉంటూ తన పిల్లల భాద్యతలు చూసుకుంటోంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ రేణు దేశాయ్ తన పిల్లల గురించి అనేక విశేషాలు పంచుకోవడం చూస్తూనే ఉన్నాం. అకిరా నందన్, ఆద్య నెమ్మదిగా పెద్దవాళ్లు అవుతుండడంతో సోషల్ మీడియాలో వారిపై ఫోకస్ పెరుగుతోంది. 

ముఖ్యంగా అకిరా నందన్ ఎక్కడ కనిపించినా ఆ దృశ్యాలు ఇంటర్నెట్ లో తెగ వైరల్ అవుతున్నాయి.అలాగే ఆద్య కూడా అన్నతోపాటే కనిపిస్తోంది. రీసెంట్ గా అన్న చెల్లెల్లు ఇద్దరూ మెగా ఫ్యామిలీ సంక్రాంతి సెలెబ్రేషన్స్ లో సందడి చేశారు. పవన్ కళ్యాణ్ పాటతో అకిరా, ఆద్య ఫోటోని కూడా రేణు దేశాయ్ పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. 

అకిరాకి సంగీతం అంటే చాలా ఆసక్తి ఉంది. సంగీతంలో అకిరా శిక్షణ తీసుకుంటున్నాడు. అదేవిధంగా మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్చుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే రేణు దేశాయ్ తాజాగా తన కుమార్తె ఆద్య గురించి చేసిన పోస్ట్ పవన్ ఫ్యాన్స్ ని ఖుషి చేసే విధంగా ఉంది. 

ఆద్య తాజాగా కరాటే, బాక్సింగ్ తరహాలో మార్షల్ ఆర్ట్స్ పంచ్ లు విసురుతూ కనిపిస్తోంది. ఆమె సరదాగా అలా పంచ్ లు విసురుతున్నప్పటికీ ఫ్యాన్స్ మాత్రం థ్రిల్ అవుతున్నారు. తండ్రి బాటలో కూతురు కూడా పయనిస్తోందా .. ఆద్య కూడా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటోందా అంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by renu desai (@renuudesai)

ఆద్య చేస్తున్న బాక్సింగ్ పంచ్ లపై రేణు దేశాయ్ ఫన్నీగా కామెంట్ పెట్టింది. నన్ను ఇబ్బంది పెట్టాలనుకునేవారు ఈ రోజు నుంచి జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే వాళ్ళు నా పర్సనల్ సెక్యూరిటీని ఎదుర్కొనాలి అంటూ పోస్ట్ చేసింది. తన కుమార్తె తనకి బాడీగార్డ్ గా మారినట్లు రేణు దేశాయ్ పేర్కొంది. ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios